NTV Telugu Site icon

Small Savings Schemes: పన్ను మినహాయింపు, భద్రతతో కూడిన పెట్టుబడులకు బెస్ట్ స్కీమ్స్ ఇదిగో!

Small Savings Schemes

Small Savings Schemes

Small Savings Schemes: కష్టపడి సంపాదించిన సొమ్మును భవిష్యత్తు అవసరాల కోసం ఏదో ఒక దానిలో పెట్టుబడి పెట్టడానికి తెగ ఆలోచిస్తుంటారు ప్రజలు. అయితే ఇందుకోసం భద్రతతో కూడిన పెట్టుబడులకు పోస్ట్ ఆఫీస్ స్కీములు ఇప్పటికీ పెట్టుబడిదారులలో ఎంతో ప్రాచ్యుర్యాన్ని పొందాయి. ఎందుకంటే ఇవి సురక్షితమైనవి, నష్టాలు లేకుండా పెట్టుబడి పెట్టేందుకు అనువైనవి కాబట్టి. అందుకే పెట్టుబడిదారులు వీటిని ఎక్కువగా ఎంచుకుంటారు. అంతేకాదండోయ్.. ఈ స్కీముల ద్వారా పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. 80C సెక్షన్ కింద పెట్టుబడులు పెట్టి రూ.1.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. మరి టాక్స్ సేవింగ్స్ కోసం పోస్ట్ ఆఫీస్ స్కీముల గురించి ఒక లుక్ వేద్దామా..

Read Also: BEL: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో జాబ్స్.. నెలకు రూ.90 వేల జీతం

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS):
ఇది పెద్ద వయసు వారికి రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్కీమ్. ఈ స్కీమ్ లో కనీసం రూ.1,000తో ప్రారంభించి, గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుత వడ్డీ రేటు 8.2% గా ఉంది. పైగా 80C సెక్షన్ కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ (POTD):
ఈ స్కీమ్‌ లో 5 సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు లభిస్తుంది. కనీస పెట్టుబడి రూ.1,000తో సేవింగ్ ను మొదలు పెట్టవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ కు వడ్డీ రేటు 7.5% గా ఉంది. అయితే 5 ఏళ్ల కంటే తక్కువ కాలానికి పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు వర్తించదు.

Read Also: Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌… మెట్రో రైలు సమయం పొడిగింపు

సుకన్య సమృద్ధి యోజన (SSY):
ఇది బాలికల భవిష్యత్తును మెరుగుపరిచేందుకు రూపొందించిన ప్రభుత్వ స్కీమ్. కేవలం రూ. 250తో ప్రారంభించవచ్చు. 80C సెక్షన్ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు 8.2%గా ఉంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF):
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది ఎక్కువ మంది పెట్టుబడిదారులు ఇష్టపడే స్కీం. ఈ స్కీమ్‌లో మొత్తం రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టి ఆదాయపు పన్నులో మినహాయింపు పొందవచ్చు. అయితే, 15 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది. ప్రస్తుతం ఇందులో 7.1% వడ్డీ రేటు అందుతుంది. దీర్ఘకాల పెట్టుబడిదారులకు ఇది మంచి ఎంపిక.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC):
ఈ స్కీమ్ లో కూడా కేవలం రూ.1,000తో ప్రారంభించవచ్చు. PPF మాదిరిగానే 80C సెక్షన్ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ స్కీమ్‌లో 5 సంవత్సరాల గడువు ఉంటుంది. ఈ ప్లాన్ లో ప్రస్తుత వడ్డీ రేటు 7.7% గా ఉంది.