Cheapest and Best Mileage Diesel Car is Tata Altroz: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ‘టాటా మోటార్స్’ కంపెనీ పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ మరియు ఎలక్ట్రిక్ కార్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ఇందులో హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ సెడాన్, కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు మిడ్-సైజ్ ఎస్‌యూవీలు ఉన్నాయి. టాటా నుంచే వచ్చే కార్లు అన్ని కూడా మంచి మైలేజ్ ఇస్తాయి. అయితే అత్యంత చౌకైన డీజిల్ కారు ఏదంటే.. ‘టాటా ఆల్ట్రోజ్’ అని చెప్పాలి. అంతేకాదు ఈ కారు 20 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.
టాటా ఆల్ట్రోజ్ కారు పెట్రోల్, సీఎన్‌జీ మరియు డీజిల్ ఇంధన ఎంపికలను కలిగి ఉంది. ఈ కారు ధర రూ. 6.65 లక్షల నుంచి ఆరంభమవుతుంది. టాప్ వేరియంట్ అయితే రూ. 10.80 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. టాటా ఆల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ ధర రూ 8.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ ధర బేస్ వేరియంట్ ఎక్స్‌ఎమ్ ప్లస్ డీజిల్ వేరియంట్‌ది.
Also Read: Best Mileage Bikes: బెస్ట్ మైలేజ్ బైక్స్.. టాప్-2లో హోండా, టీవీఎస్!
టాటా ఆల్ట్రోజ్ కారులో 1.2-లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మూడింటిలో ఉంటుంది. డీజిల్ ఇంజన్ 90PS వద్ద 4000rpm మరియు 200Nm వద్ద 1250-3000rpmని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 23.64 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, పవర్ విండోస్, లెదర్ స్టీరింగ్ వీల్, లెదర్ సీట్లు, అడ్జస్టబుల్ వంటి ఫీచర్లను ఇది కలిగి ఉంది. ఈ కారు 5-స్టార్ సేఫ్టీ రేటెడ్ కారు. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్-సీట్ యాంకర్స్, ఆటో పార్క్ లాక్ సెన్సార్‌లతో వస్తుంది.