NTV Telugu Site icon

Best Business Ideas : పల్లెల్లో ఉంటున్నవారికి అదిరిపోయే బిజినెస్ ఐడియాలు..

Tea (3)

Tea (3)

ఈరోజుల్లో ఉద్యోగాలు చెయ్యడం కన్నా సొంతంగా ఏదొక బిజినెస్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.. పల్లెటూరులో ఉంటున్న వారు ఎన్నో రకాల బిజినెస్ లను చేస్తూ లాభాలను పొందుతున్నారు.. గ్రామాల్లో చేస్తున్న బిజినెస్ లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది.. ఆ బిజినెస్ లు ఏంటో ఒక లుక్ వేద్దాం పదండీ..

పల్లెల అవసరాలను గుర్తించగలిగితే, అది బిజినెస్ అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని సీజన్లలో స్థిరమైన ఆదాయాన్ని అందించే వ్యాపార మార్గాలు కొన్ని ఉన్నాయి. మీరు కూడా మంచి బిజినెస్ ఐడియా కోసం చూస్తుంటే.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జించె బిజినెస్ లు ఏవో తెలుసుకోవడం ముఖ్యం.. ఇకపోతే గ్రామాల్లో కిరాణా కొట్టు బిజినెస్ కూడా మంచి ఆదాయ మార్గం. ప్రాంతం ఏదైనా నిత్యావసరాల డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. ఈ వ్యాపారం ఎప్పటికీ లాభాలను అందిస్తుంది. తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్ ప్రారంభించి రోజువారీ ఆదాయం పొందవచ్చు…

కోళ్ల పెంపకం బిజినెస్ ద్వారా గ్రామాల్లో మంచి ఆదాయం పొందవచ్చు. ఈ వ్యాపారం ప్రారంభానికి పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు. అయితే అవగాహన ఉండాలి. ప్రస్తుతం పౌల్ట్రీ ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ఏడాది పొడవునా బిజినెస్ జరుగుతుంది. అందుకు తగ్గట్టు ఆదాయం ఉంటుంది..

గ్రామీణ ప్రాంతాల్లో టీకి డిమాండ్ ఏమాత్రం తగ్గదు. గ్రామాల్లో రైతులు ఉదయం టీ తాగిన తరువాతే పొలం పనులకు వెళ్తుంటారు. దీంతో పల్లెల్లో టీ కొట్టు పెట్టి మంచి ఆదాయం ఆర్జించవచ్చు. ఏడాది పొడవునా అన్ని సీజన్లలో టీ బిజినెస్‌కు డిమాండ్ ఉంటుంది..

ఆయిల్ మిల్లు.. గ్రామాల్లో నూనెలకు మంచి డిమాండ్ ఉంది.. సోయాబీన్స్, వేరుశెనగ, ఆవాల గింజల నుంచి నూనెను తీయడానికి గ్రామాల్లో ఆయిల్ మిల్లులను ఏర్పాటు చేయవచ్చు. దీంతో స్థానిక రైతుల పంటలను ప్రాసెస్ చేయడంతో పాటు వినియోగదారులకు విలువైన ఉత్పత్తిని అందించవచ్చు..

ఇకపోతే గ్రామాల్లో ఇప్పటికీ పిండి మరలు అందుబాటులో లేవు. జొన్నలు, రాగులు, గోధుమలను మర ఆడించడానికి సమీపంలోని పట్టణాలకు వెళ్తుంటారు. ఈ అవసరాన్ని మీ గుర్తించి బిజినెస్‌గా ప్రారంభిస్తే సక్సెస్ పుల్‌గా రన్ చేయవచ్చు.. ఇవేకాదు ఇంకా చాలా ఉన్నాయి.. ముత్యాలను తయారు చెయ్యడం, ఇక గ్రామాల్లో మెడికల్ షాపులు ఏర్పాటు చేస్తే ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులోకి రావడంతో పాటు మంచి బిజినెస్ జరుగుతుంది. అవసరమైన లైసెన్సులు, స్టాక్‌ పొందడానికి ముందుగా కొంత పెట్టుబడి అవసరం. ఆ తరువాత స్థిరమైన ఆదాయం అందుతుంది.. ఇక ఇంటర్‌నెట్ కేఫ్ కూడా మంచి ఆదాయాన్ని ఇస్తున్నాయి.. పుట్టగొడుగుల పెంపకం కూడా మంచి లాభాలను అందిస్తుంది..

Show comments