NTV Telugu Site icon

ATM Franchise: అదిరిపోయే ఐడియా.. ఏటీఎం ఫ్రాంఛేజీతో నెలకు రూ.70,000 సంపాదించండి

Atm

Atm

ATM Franchise: ప్రస్తుత కాలంలో బాగా బతకాలి అంటే ఉద్యోగం ఒక్కటి చేస్తే సరిపోదు. పెద్దలు అన్నట్లు రెండు చేతులతో కాదు నాలుగు చేతులతో అయినా సంపాదించాలి. అందుకే ప్రస్తుతం యువత కేవలం ఉద్యోగం మాత్రమే కాకుండా దానితో పాటు మంచి బిజినెస్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. అయితే ఆలోచించాలే కానీ మనం చేయడానికి చాలానే బిజినెస్ లు ఉంటాయి. వాటిలో డబ్బు కూడా బాగానే సంపాదించవచ్చు. అది బాగుంది అనిపిస్తే ఉద్యోగం మానేసి పూర్తి సమయం దానికే కేటాయించవచ్చు. అలాంటి బిజినెస్ ఐడియాలలోనే బెస్ట్ ది ఏటీఎం ఫ్రాంఛేజీ. ఏంటీ దీనితో కూడా బిజినెస్ చేయొచ్చా అనుకుంటున్నారా? అవునండి చేయొచ్చు. ఏటీఏంలను కేవలం బ్యాంకులు మాత్రమే నిర్వహిస్తాయి అనుకోవడం పొరపాటు అవి సాధారణ ప్రజలకు కూడా ఫ్రాంచేజీలు ఇస్తాయి.

Also Read: Rakul Preet Singh: ఖరీదైన కారును కొన్న రకుల్..ఎన్ని కోట్లో తెలుసా?

ఏటీఎం ఫ్రాంఛేజీ తీసుకోవడానికి సమర్పించాల్సిన డాక్యూమెంట్లు: 

మనం కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐడీ ప్రూఫ్ కోసం పాన్ కార్డ్ , ఆధార్ కార్డ్ , వోటర్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే  అడ్రస్ ప్రూఫ్ కోసం ఎలక్ట్రిసిటీ బిల్ లేదా రేషన్ కార్డ్ లేదా బ్యాంక్ పాస్ బుక్ లాంటివి సమర్పించాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటు 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, వ్యాలిడ్ ఇమెయిల్ ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, జీఎస్‌టీ రిజిస్ట్రేషన్, జీఎస్‌టీ నెంబర్ లాంటివి తప్పనిసరి.

ఫ్రాంఛేజీ తీసుకోవడానికి కావాల్సిన పెట్టుబడి

ఇక దీనికోసం పెట్టుబడిగా మనకి రూ. 5లక్షల వరుకు అవసరం ఉంటుంది. వీటిని మనం బ్యాంకులకు చెల్లించాలి.అప్పుడే వారు మనకి ఫ్రాంచేజీ ఇస్తారు. అయితే వీటిలో రూ.2 లక్షలు రీఫండబుల్ అమౌంట్, మిగలిన రూ.3 లక్షలు వర్కింగ్ క్యాపిటల్. దీని ద్వారా ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెల రూ. 45,000 నుంచి రూ.70,000 వరకు హాయిగా ఇంట్లో కూర్చొనే సంపాదించవచ్చు.  కాంట్రాక్ట్ ముగియడం కన్నా ముందే ఏటీఎం మూసివేయాలనుకుంటే మీకు రూ.1 లక్ష రీఫండ్ మాత్రమే వస్తుంది.

ఏటీఎం స్టార్ చేయడానికి కావాల్సినవి: 

ఏటీఎం ప్రారంభించాలంటే మీకు 50 నుంచి 80 చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ ఉండాలి. 100 మీటర్ల పరిధిలో ఏ బ్యాంక్ ఏటీఎం ఉండకూడదు. ఏటీఎం భద్రత కోసం కాంక్రీట్ రూఫ్ తప్పనిసరిగా ఉండాలి. సొసైటీ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఇవన్నీ ఉంటే మీరు ఫ్రాంచేజీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫ్రాంఛేజీ నుంచి డబ్బులు ఎలా వస్తాయి: 

ఏటీఎంలో జరిగే ప్రతి లావాదేవీ నుంచి మీకు డబ్బులు వస్తాయి. నగదు లావాదేవీలు, నగదు రహిత లావాదేవీలు ఇలా ప్రతి దాని నుంచి మీరు కమిషన్ పొందవచ్చు. నగదు లావాదేవీలు అంటే మీరు ఏటీఎం నుంచి మనీ విత్ డ్రా చేయడం లాంటివి, నగదు రహిత లావాదేవీలు అంటే మినీ స్టేట్ మెంట్ లాంటివి. ఇక నగదు లావాదేవీలపై రూ. 8, నగదు రహిత లావాదేవీలపై రూ. 2ల కమిషన్ వస్తుంది. ఇలా మీరు దాదాపు నెలకు రూ. 45,000 నుంచి రూ.70,000 వరకు పొందవచ్చు. ఇక ఇలా పొందాలంటే మీ ఏటీఎం నుంచి రోజుకు దాదాపు 500 ఏటీఎం లావాదేవీలు జరగాల్సి ఉంటుంది. టాటా ఇండీక్యాష్, ముత్తూట్, ఇండియా వన్ లాంటి సంస్థలు ఈ ప్రాంఛేజీలు ఇస్తుంటాయి. పూర్తి వివరాలు వాటి వెబ్ సైట్లలో ఉంటాయి. లేదా మీరే వాటి కార్యాలయాకు వెళ్లి తెలుసుకోవచ్చు.

 

 

 

Show comments