NTV Telugu Site icon

5G Smartphones: కేవలం పదివేలలో బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్స్..

Budget Phones

Budget Phones

5G Smartphones: భారత్ లాంటి అనేక దేశాలలో చాలామంది బడ్జెట్ ధరలలో బెస్ట్ 5G ఫోన్స్ కావాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్టే ప్రతి కంపెనీ వినియోగదారులకు అనుగుణంగా బడ్జెట్ ధరలలో మొబైల్స్ ఫోన్స్ అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా 10000 – 15000 లోపు మొబైల్స్ కోసం ప్రజలు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు. ఇకపోతే, ప్రస్తుత మార్కెట్ లో కేవలం 10,000 లోపు ధరలో ఉత్తమమైన 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా వినియోగదారులు తక్కువ బడ్జెట్‌లో అధునాతన ఫీచర్లను సైతం పొందవచ్చు. మరి ప్రస్తుతం ​10,000 లోపు ధరలో ఉత్తమమైన 5G స్మార్ట్‌ఫోన్ల వివరాలను చూద్దామా..

Read Also: Health Tips: ఉక్కు లాంటి కండరాల కోసం ఈ కూరగాయలు బెస్ట్.. గుడ్లలో కంటే ఎక్కువ ప్రోటీన్!

మోటరోలా మోటో G35 5G:
ఈ మొబైల్ లో 6.72-అంగుళాల ఫుల్ HD+ IPS LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌, యూనిసాక్ T760 ప్రాసెసర్‌ను కలిగి ఉంది ఈ మొబైల్. ఇందులో 4GB RAM + 128GB స్టోరేజ్‌ కలిగి ఉంటుంది. ఇందులో 5000mAh బ్యాటరీతో పాటు, 50MP + 8MP రియర్ కెమెరా సెటప్, 16MP ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ. 9,999 మాత్రమే. ​

రియల్‌మీ C63 5G:
ఈ రియల్‌మీ C63 5G మొబైల్ లో 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 4GB RAM + 64GB స్టోరేజ్‌ను మాత్రమే అందిస్తుంది. 5000mAh బ్యాటరీతో పాటు, 50MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ. 9,999 మాత్రమే. ​

షియోమీ రెడ్ మీ 14C 5G:
ఇందులో 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన అద్భుతమైన డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 Gen2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 4GB RAM + 64GB స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకోవచ్చు. ఇందులో 5160mAh భారీ బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే 50MP డ్యుయల్ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ. 9,999 మాత్రమే. ​

Read Also: KL Rahul: కేఎల్ రాహుల్‌కు ప్రత్యేక విషెష్ చెప్పిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్.. వీడియో వైరల్!

పోకో M6 ప్రో 5G:
ఇందులో 6.79-అంగుళాల ఫుల్ HD+ IPS LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌, స్నాప్‌డ్రాగన్ 4 Gen2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ మొబైల్ 4GB RAM + 128GB స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. 5000mAh బ్యాటరీతో పాటు, 50MP + 2MP రియర్ కెమెరా సెటప్, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ కేవలం రూ. 9,499 మాత్రమే. ​

శాంసంగ్ గెలాక్సీ F06 5G:
ఈ ఫోన్ 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ కలిగి ఉంటుంది. 4GB RAM + 128GB స్టోరేజ్‌ను కలిగి ఉండి, 1TB వరకు స్టోరేజిని విస్తరించుకోవచ్చు. 5000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 50MP + 2MP డ్యుయల్ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాలు ఇందులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధర కేవలం రూ. 9,199 మాత్రమే.