NTV Telugu Site icon

Best 5G Smartphones 2024: మీ బడ్జెట్ 30 వేలా.. బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!

Best 5g Smartphones 2024

Best 5g Smartphones 2024

Best 5G Smartphones in India Under 30000 Thousand: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనాలని చూస్తున్నారా?.. మీ బడ్జెట్​ రూ.30 వేల లోపే ఉంటుందా?.. అయినా కూడా మంచి ఫోన్ కొనేసుకోవచ్చు. 12జీబీ+256జీబీ కూడా కొనేసుకోవచ్చు. వన్​ప్లస్​, రియల్​మీ, వివో, రెడ్​మీ, మోటోరొలా లాంటి టాప్ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. భారత్ మార్కెట్​లో ప్రస్తుతం రూ.30వేల బడ్జెట్​లో అందుబాటులో ఉన్న బెస్ట్​ స్మార్ట్‌ఫోన్స్​ లిస్ట్​ను ఓసారి చూద్దాం.

Moto Edge 50 Pro:
మోటో ఎడ్జ్‌ 50 ప్రో 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.31,999గా ఉంది. ఆఫర్స్ సమయంలో ఈ ధర 30 వేల లోపు ఉంటుంది. 6.7 అంగుళాల 1.5K పీఓఎల్‌ఈడీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్‌ రేటు, 2000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత హెలో యూఐతో ఇది వస్తోంది. 50 ఎంపీ ప్రధాన కెమెరా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌, 13 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 10 టెలిఫొటో లెన్స్‌ ఉన్నాయి. సెల్ఫీల కోసం 50 ఎంపీ కెమెరా ఉంది. ఇందులో 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

Realme 13 Pro Plus:
రియల్‌మీ 13 ప్రో ప్లస్‌ 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.29,999గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేటు, స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌ 2 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0ని ఇచ్చారు. వెనుకవైపు 50 ఎంపీ 1 / 1.56 అంగుళాల సోనీ ఎల్‌వైటీ-701 సెన్సర్‌, 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 పెరిస్కోప్‌ టెలిఫొటో, 8 ఎంపీ అల్ట్రా వైల్డ్‌ కెమెరా ఉండగా.. సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరాను అమర్చారు. 5,200mAh బ్యాటరీతో వచ్చే ఈ మొబైల్‌ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

Redmi Note 13 Pro+:
రెడ్‌మీ నోట్‌ 13 ప్రో+ 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.31,999గా ఉంది. ఆఫర్స్ సమయంలో 30 వేల కంటే తక్కువకే లబిస్తుంది. ఇందులో 6.67 అంగుళాల అమోలెడ్‌ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్‌, 1800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, డైమెన్‌సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్‌ ఉన్నాయి. 200 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా ఇచ్చారు. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

OnePlus Nord CE4 Lite 5G:
వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 లైట్‌ 8జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ స్క్రీన్‌, 120Hz రిఫ్రెష్‌ రేటు, 2100 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌, ఔటాఫ్‌ ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 14తో వస్తుంది. వెనుకవైపు 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 కెమెరా ఇచ్చారు. 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ ఉంది. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 5,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 80W సూపర్‌ వూక్‌ పాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 కూడా మంచి ఆప్షన్.

Also Read: Flipkart Flagship Sale 2024: ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్‌ ఆరంభం.. ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ తగ్గింపు!

Oppo F27 Pro+:
ఒప్పో ఎఫ్‌ 27 ప్రో+ 8జీబీ+128జీబీ వేరయంట్‌ ధర రూ.27,999గా ఉంది. 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ 3డీ కర్వ్‌డ్‌ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేటుతో 950 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌, డైమెనిసిటీ 7050 ప్రాసెసర్, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత కలర్‌ ఓఎస్‌తో ఉంటాయి. వెనకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ సెకండరీ సెన్సర్‌.. ముందువైపు 8 ఎంపీ కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67W సూపర్‌ వూక్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది.

 

Show comments