NTV Telugu Site icon

Bengaluru: బెంగళూరులో వాటర్ సంక్షోభం మరింత తీవ్రం.. సర్కార్ ప్లాన్ ఇదే!

Water Crisies

Water Crisies

దేశంలోనే గ్రీన్‌సిటీగా పేరుగాంచిన బెంగళూరు నగరం (Bengaluru) తీవ్ర దాహార్తితో అల్లాడుతోంది. ఎన్నడూ లేని విధంగా తాగునీటి కష్టాలతో (Water Crisis) ఐటీ సిటీ కటకట లాడుతోంది. చెరువులు, కుంటలు, బోరు బావులన్నీ అడుగంటి పోయాయి. మార్చి మొదటి వారంలోనే పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే.. ముందు ముందు ఇంకెంత భయానక పరస్థితులు ఉంటాయో ఊహించుకోవచ్చు. స్వయనా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌ ఇంట్లోనే తాగునీటి ఇబ్బందులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇంట్లో ఉన్న బోరు బావి పని చేయట్లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక సామాన్యుల పరిస్థితి మరింత ఇబ్బంది కరంగా మారింది. కనీసం తాగేందుకు నీళ్లు దొరకకపోవడంతో గొంతెండుతోంది. కొందామంటే కొనే పరిస్థితులు లేకపోవడంతో మధ్యతరగతి ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇక బెంగళూరు నగరంలోని ఓ హౌసింగ్‌ సొసైటీ (Housing society) కీలక నిర్ణయం తీసుకుంది. నీటిని వృధా చేస్తే రూ.5 వేలు ఫైన్ వేస్తామని ప్రకటించింది. దీని బట్టి చెప్పొచ్చు. బెంగళూరులో తాగునీటి కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పేయొచ్చు.

ఓ వైపు నీళ్లు లేక.. ఇంకోవైపు కొందామనుకుంటే దొరకని పరిస్థితి. ఇక సాహసం చేసి నీళ్లు ట్యాంకర్ రప్పించుకుందామంటే.. ఇదే అదనుగా అమాంతంగా ధరలు పెంచేశారు. ఒకేసారి వెయ్యికి దొరికే ట్యాంకర్.. రూ.2 వేలకు పెంచేశారు. ఇలా అధిక ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 

పొలిటికల్ గేమ్

మరోవైపు ఈ నీటి సంక్షోభం పొలిటికల్ వైపు మలుపు (Political Blame Game Begin) తిరిగింది. గత బీజేపీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ నీటి సంక్షోభం తలెత్తింది అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలపై బీజేపీ కూడా తీవ్రంగానే స్పందించింది. వారం రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

హెల్ప్‌లైన్లు..

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని (CM Siddaramaiah) రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి సమస్యల పరిష్కారం కోసం హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్‌లు, ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని కరువు పరిస్థితులను పరిష్కరించడానికి స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటయ్యాయి. 223 తాలూకాలు కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించారు. 219 తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. బెంగళూరు అర్బన్ జిల్లాలోని 1,193 వార్డులతో పాటు కర్ణాటక వ్యాప్తంగా 7,082 గ్రామాలు రాబోయే నెలల్లో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

వాటర్ ట్యాంకర్ రేట్లు
ఇక అక్రమ వాటర్ ట్యాంకర్ కార్యకలాపాలపై బెంగళూరు నగర పాలక సంస్థ చర్యలు చేపట్టింది. బెంగళూరు నగరానికి నీటిని సరఫరా చేయడానికి 200 ప్రైవేట్ ట్యాంకర్లు కాంట్రాక్టు ప్రాతిపదికన నిమగ్నమై ఉన్నాయి. దీంతో బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ దయానంద ట్యాంకర్లకు రేట్లు నిర్ణయించారు.

5 కి.మీ లోపు ధరలు..
5 కిలోమీటర్లలోపు 6 వేల లీటర్ల నీటి ట్యాంకర్‌కు రూ.600.
8 వేల లీటర్ల నీటి ట్యాంకర్‌కు రూ.700.
12 వేల లీటర్ల నీటి ట్యాంకర్‌కు రూ.1000. నిర్ణయించారు.

 

5-10 కి.మీ లోపు ఈ ధరలు..

6 వేల లీటర్ల వాటర్ ట్యాంకర్‌కు రూ.750.
8 వేల లీటర్ల నీటి ట్యాంకర్‌కు రూ.850.
12 వేల లీటర్ల నీటి ట్యాంకర్‌కు రూ.1200. ఈ రేట్లు GSTతో సహా ఉంటాయి.