NTV Telugu Site icon

Bengaluru: జూదానికి బానిసైన విద్యార్థిని.. యూనివర్సిటీలో ఆత్మహత్య

Sueke

Sueke

బెంగళూరులోని మహారాణి క్లస్టర్ యూనివర్శిటీలో విషాదం చోటుచేసుకుంది. 19 ఏళ్ల విద్యార్థిని తన హాస్టల్ గదిలో శవమై కనిపించింది. మృతురాలు కోలారు జిల్లా శ్రీనివాసపూర్‌కు చెందిన పవన అనే విద్యార్థినిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Shivraj Singh: ఎమ్మెల్యే పదవికి శివరాజ్ సింగ్ రాజీనామా

పవన ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటు పడినట్లుగా పోలీసులు గుర్తించారు. కాలేజీ ఫీజు డబ్బును జూదమాడేందుకు ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. డబ్బు అంతా పోగొట్టుకోవడం… ఆర్థిక ఒత్తిడి, పోగొట్టుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోవడంతో ఆమె దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక పరిస్థితులు తీవ్రం అవ్వడంతోనే ప్రాణాలు తీసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Karnataka High Court: 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో కోర్టు కీలక తీర్పు..

పవన విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం బీఎస్సీ విద్యార్థిని. హాస్టల్‌లో మూడు రోజులు సెలవులు ఉండడంతో ఆదివారం రాత్రి ఆమె ఒంటరిగా ఉండడంతో ఈ ఘటన జరిగింది. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇదిలా ఉంటే కాలేజీ ఫీజు కోసం తల్లిదండ్రులు రూ.15 వేలు పంపించారు. కానీ ఆ డబ్బంతా ఆన్‌లైన్ గేమ్‌లో పెట్టి పోగొట్టుకుంది. దీంతో మనస్తాపం చెంది ఊపిరి తీసుకుంది. కుటుంబ సభ్యులకు దు:ఖాన్ని మిగిల్చి వెళ్లిపోయింది. హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Rakshith Shetty : ఓటీటీ సంస్థల పై హీరో సంచలన వ్యాఖ్యలు..