Site icon NTV Telugu

Bengaluru: మెట్రోలో పరుగులు పెట్టిన గుండె.. రెండోసారి కూడా సక్సెస్

Bengaluru Heart Transplant

Bengaluru Heart Transplant

Bengaluru: నిజంగా ఇది అద్భుతం. మెట్రోలో గుండె పరుగులు పెట్టింది. ఏంటి ఇది సాధారణం అని ఆలోచిస్తున్నారా.. ఈ గుండెను వైద్యులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడానికి మెట్రోను ఉపయోగించారు. ఇది అసలు ముచ్చట. కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన వెలుగుచూసింది. ట్రాఫిక్‌ సమస్య నుంచి తప్పించుకోడానికి, సరైన సమయానికి గుండెను చేర్చాల్సిన చోటుకు చేర్చడానికి మెట్రోను ఎంచుకున్నట్లు వైద్యులు తెలిపారు. మీకు తెలుసా ఈ విధంగా ఒక గుండెను మెట్రో ద్వారా విజయవంతంగా రవాణా చేయడం ఇది రెండవసారి.

READ ALSO: Royal Sundaram: అరుదైన మైలురాయిని సాధించిన జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ

యశ్వంత్‌పూర్‌ నుంచి శేషాద్రిపురం వరకు
బెంగళూరులోని యశ్వంత్‌పూర్‌లోని స్పార్ష్ ఆసుపత్రి నుంచి శేషాద్రిపురంలోని అపోలో ఆసుపత్రికి గురువారం వైద్య బృందం గుండెను తరలించింది. మొదట స్పార్ష్ ఆసుపత్రి నుంచి యశ్వంత్‌పూర్ ఇండస్ట్రీ మెట్రో స్టేషన్‌కు అంబులెన్స్‌లో హృదయాన్ని తీసుకువచ్చారు. తర్వాత అక్కడి నుంచి మెట్రో ద్వారా సంపిగే రోడ్ మెట్రో స్టేషన్‌కు తీసుకెళ్లి.. అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి గుండెను అంబులెన్స్‌లో చేర్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటికి వచ్చింది.

మెట్రో కోచ్ రిజర్వ్ చేశారు..
గుండెను రవాణా చేయడానికి వైద్యులు మెట్రో కోచ్‌ను రిజర్వ్ చేశారు. యశ్వంత్‌పూర్ ఇండస్ట్రీ, సంపిగే మెట్రో స్టేషన్ మధ్య ఏడు మెట్రో స్టేషన్లు ఉన్నాయి. మెట్రోలో గురువారం రాత్రి 11:01 గంటలకు యశ్వంత్‌పూర్ ఇండస్ట్రీ నుంచి బయలుదేరి రాత్రి 11:21 గంటలకు సంపిగే రోడ్ మెట్రో స్టేషన్‌కు చేరుకుంది. ఈ పరిస్థితిలో యశ్వంత్‌పూర్ ఇండస్ట్రీ నుంచి సంపిగే రోడ్ మెట్రో స్టేషన్ చేరుకోవడానికి కేవలం 20 నిమిషాలు మాత్రమే పట్టింది. మెట్రో సెక్యూరిటీ అధికారులు, వైద్యుల పర్యవేక్షణలో గుండెను విజయవంతంగా రవాణా చేశారు. బెంగళూరులో సాధారణంగా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో గుండెను ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి కేవలం 20 నిమిషాల్లోనే రవాణా చేయడం వండర్ పుల్. బెంగళూరులో ఈ విధంగా గుండెను రవాణా చేయడం ఇది రెండవసారి. వైద్యులు రోగి ప్రాణాలను కాపాడటానికి గుండెను మెట్రోలో పరుగులు పెట్టించారు.

READ ALSO: No Work Full Salary: మరీ ఇంత దారుణమా.. 16 ఏళ్లుగా ఆఫీసుకి రాకుండా.. పూర్తి జీతం!

Exit mobile version