Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Woman Auto Driver: ఐటీ ఉద్యోగం ఉందంటే సమాజంలో ఒక మంచి హోదా, చేతినిండా డబ్బు ఉన్నట్లే అనుకుంటారు. కానీ, ఆ మెరిసే కార్పొరేట్ జీవితం వెనుక ఎవరి కష్టాలు వారికుంటాయి. బెంగళూరుకు చెందిన ఓ యువతి కథ సరిగ్గా ఇలాంటిదే. ఒకప్పుడు ప్రశాంతంగా ఏసీ గదుల్లో ఐటీ ఉద్యోగం చేసిన ఆమె, ఇప్పుడు బెంగళూరు వీధుల్లో ర్యాపిడో ఆటో నడుపుతోంది. ఎవరైనా ఆమెను ఆటో డ్రైవర్ సీటులో చూడగానే సాధారణంగా జీవనోపాధి కోసం కష్టపడుతున్న మరో మహిళ అనుకుంటారు. కానీ ఆమె వెనుక ఉన్న అసలు కథ విన్నారంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
ఈ యువతికి చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ప్రకారం.. ఆ యువతి తండ్రి హఠాన్మరణం చెందడంతో ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఇంట్లో తల్లిని ఒంటరిగా వదిలేసి నైట్ షిఫ్ట్‌లు చేయడం ఆమెకు చాలా కష్టంగా మారింది. తల్లికి తోడుగా ఉంటూ, ఇంటి బాధ్యతలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇక నైట్‌షిఫ్ట్ ఉద్యోగాలు చేయడం కుదరదని గ్రహించి, ఆ ఐటీ కొలువుకు స్వస్తి చెప్పి పూర్తిగా కొత్త మార్గాన్ని ఎంచుకుంది. కార్పొరేట్ రంగంలో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా ఆటో నడపాలని నిర్ణయించుకుంది. మొదట్లో ఈ నిర్ణయాన్ని ఆమె కుటుంబ సభ్యులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు, బాగా వ్యతిరేకించారు కూడా. కానీ ఆమె మాత్రం వెనక్కి తగ్గకుండా తన దారిలోనే ముందుకు సాగింది.
Also Read
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
ఇటీవల తన్వి అనే కంటెంట్ క్రియేటర్ ఈ ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుంది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ మెల్లగా కెరీర్, కుటుంబం, సమాజం మహిళలపై పెట్టే ఒత్తిళ్లపైకి వెళ్లింది. ఆమె ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయిన తన్వి, “నువ్వు ఐటీలో చేశావా?” అని అడగ్గా, ఆమె నవ్వుతూ “అవును” అని సమాధానమిచ్చింది. ఈ కొత్త వృత్తి గురించి చెప్తూ.. “ఇది అనుకున్నంత చెడ్డదేమీ కాదు, పైగా ఐటీలో కంటే ఆటో నడపడం వల్లే ఎక్కువ సంపాదిస్తున్నా” అని చెప్పడం విశేషం. అన్నింటికన్నా ముఖ్యం.. సొంతంగా సమయాన్ని కేటాయించుకుంటూ, రాత్రిపూట తల్లికి తోడుగా ఉండటానికి ఈ పని ఎంతో ఉపయోగపడుతోందని సంతోషంగా పంచుకుంది. అయితే, ఈ ప్రయాణంలో ఆమెకు ఎన్నో రకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. “అంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఆటో నడపడం ఏంటి?” అని చాలామంది ప్రయాణికులు ఆశ్చర్యంగా ప్రశ్నిస్తుంటారు. పురుషులదే పైచేయిగా ఉండే ఈ రంగంలో, సమాజంలో ఉన్న పాత ఆలోచనలను ఆమె నిత్యం ఎదుర్కొంటూనే ఉంది.
ఈ సంభాషణను వీడియో తీసిన తన్వి.. జనాలు ఏమనుకుంటారు? అనే ఆలోచనను పక్కనపెట్టి తను అనుకున్నది సాధించిన ఈ మహిళా డ్రైవర్ ధైర్యాన్ని అభినందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసింది. “ఆమె ఇతరుల మాటలను పట్టించుకోలేదు. స్వేచ్ఛను, స్వతంత్రతను, తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకోవడాన్ని ఎంచుకుంది. ధైర్యంగా ఉండటం అంటే ఏదో అద్భుతాలు చేయడమే కాదు, ‘నాకు ఇది కావాలి, నేను దీన్నే ఎంచుకుంటున్నాను’ అని చెప్పగలగడమే అసలైన ధైర్యం” అని వీడియో పోస్ట్ చేస్తూ క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ, ఏకంగా 3 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. చాలా మంది నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Share Nani: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!