ఢిల్లీ నుంచి బెంగళూరు బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. ఈ మేరకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 6.00 గంటలకు ఎయిర్ ఇండియా AI 807 విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి బెంగళూరు బయలుదేరిందని తెలిపారు.
ఇంతలో ఎయిర్ కండిషనింగ్ యూనిట్‌లో అనుమానాస్పదంగా మంటలు చెలరేగడంతో తిరిగి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరి ల్యాండింగ్ అయింది. ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. సాయంత్రం 6.40 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు పూణె ఎయిర్ పోర్ట్‌లో ఎయిర్ ఇండియా విమానానికి తృటీలో ప్రమాదం తప్పింది. పూణె నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానం రన్ వేపై లగేజ్ ట్రక్క్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపీరి పీల్చుకున్నారు.
