NTV Telugu Site icon

Health tips: 150 వ్యాధులకు ఒకటే ఔషధం.. ర‌ణ‌పాల మొక్క ఉపయోగాలు

Untitled 17

Untitled 17

Health: ఈ ప్రకృతి మనకి ఎన్నో ఔషధ మొక్కలని ప్రసాదించింది. మన చుట్టూనే ఎన్నో ఔషధ మొక్కలు పెరుగుతున్నాయి. కానీ మనం వాటిని గుర్తించలేకున్నాం. మనం అలంకరణ కోసం పెంచే మొక్కల్లో కొన్ని ఔషధ గుణాల్ని కలిగివున్నాయి. ఆ వరుసలోకే వస్తుంది రణపాల మొక్క. రణపాల మొక్కని ఇళ్లల్లో మరియు కార్యాలయాల్లో అలంకరణ మొక్కగ పెంచుతుంటారు. అయితే రణపాల మొక్క అలాకారానికే కాదు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 వ్యాధులను నయం చేయగల శక్తి రణపాల మొక్కకి ఉంది. రణపాల మొక్క నయం చేయగల వ్యాధుల్లో కొన్ని వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read also:USA:” ఆ విషయంలో భారత్ కు ప్రత్యేక మినహాయింపులేమీ లేవు”

రణపాల ఆకు చూడడానికి దళసరిగా ఉంటుంది. దీని రుచి వగరు మరియు పులుపుగా ఉంటుంది. ఈ మొక్క ఆకుల నుండే వేర్లు వస్తాయి. కనుక ఆకులను నాటడం ద్వారా మొక్కలు పెంచవచ్చు. ఈ మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్,యాంటీ హిస్టామైన్ తోపాటు అనాఫీలాక్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. కనుక దీని ఆకు తినడం ద్వార, కషాయం తయారు చేసి తీసుకోవడం ద్వార, ఆకు రుబ్బి కట్టు కట్టడం ద్వార చాల ఉపయోగాలు ఉన్నాయి. దీని ఆకులు తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ని క్రమబద్దీకరిస్తుంది. కిడ్నీ స‌మ‌స్య‌లు తగ్గుతాయి. దీని ఆకులని వేడిచేసి గాయాల పైన పెట్టడడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. ఈ ఆకులని నూరి పొట్టుగా తల పైన పెట్టుకోవడం వల్ల తల నొప్పి తగ్గుతుంది. ఈ ఆకుల పసరుని రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవినొప్పి తగ్గుతుంది. రోజు ఈ ఆకుల్ని తినడం ద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.