Ben Stokes dated school teacher Clare Ratcliffe for seven years : ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా లండన్‌లోని ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్, భారత్ మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్ రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ దూరమయ్యాడు. కుడి భుజం గాయం కారణంగా స్టోక్స్ ఐదో టెస్టు నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో ఓలీ పోప్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆడిన నాలుగు టెస్టుల్లో స్టోక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. 17 వికెట్లతో పాటు 304 పరుగులు చేశాడు. అయితే స్టోక్స్ ఓ స్కూల్ టీచర్‌తో డేటింగ్ చేశాడని చాలా మందికి తెలిసుండదు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
బెన్ స్టోక్స్ సతీమణి పేరు క్లైర్ రాట్‌క్లిఫ్. బెన్ కెరీర్ ఆరంభం నుంచి బెన్‌కు ఆమె అండగా ఉన్నారు. 2010లో స్టోక్స్ క్రికెట్ ప్రపంచంకు పెద్దగా తెలియదు. అప్పటికి ఇంగ్లండ్ జాతీయ జట్టులో కూడా భాగం కాలేదు. ఆ సమయంలో బెన్, క్లైర్ మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారింది. మూడు సంవత్సరాలు డేటింగ్ తర్వాత 2013లో క్లైర్‌కు స్టోక్స్ ప్రపోజ్ చేశాడు. దేశీయ క్రికెట్ అయినా.. జాతీయ క్రికెట్ అయినా క్లైర్ మద్దతుగా నిలిచారు. క్లైర్ వృత్తిరీత్యా స్కూల్ టీచర్. 2011 ఇంగ్లండ్ జట్టులో చోటు దక్కించుకున్న స్టోక్స్.. కొన్నేళ్లకు జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. అక్టోబర్ 2017లో వివాహం చేసుకున్నారు. స్టోక్స్, క్లైర్‌కు ఇద్దరు పిల్లలు.
Also Read: Bhagavanth Kesari: ఈ గౌరవం వారికే.. జాతీయ అవార్డుపై స్పందించిన బాలకృష్ణ!
క్లైర్ రాట్‌క్లిఫ్ నిత్యం బెన్ స్టోక్స్ వెంటే ఉండి ప్రోత్సహించేవారు. 2017లో బ్రిస్టల్‌లో జరిగిన ఓ సంఘటన తర్వాత స్టోక్స్ చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్లిష్ట సమయంలో క్లైర్ అతన్ని విడిచిపెట్టలేదు. మానసికంగా బలంగా ఉంచడమే కాకుండా.. అతనికి మద్దతుగా నిలబడ్డారు. ఆపై మరలా జాతీయ జట్టులోకి వచ్చి కెప్టెన్ అయ్యాడు. ఆల్‌రౌండర్‌గా జట్టుకు విశేష సేవలు అందిస్తున్నాడు. స్టోక్స్ ఇప్పటివరకు 115 టెస్టులు, 114 వన్డేలు, 43 టీ20లు ఆడాడు.
