Site icon NTV Telugu

IPL 2023: కోట్లు పెట్టి కొంటే ఏం లాభం.. ఐపీఎల్‌లో అట్టర్ ఫ్లాప్

Ben Stocks

Ben Stocks

ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ను రూ. 16.25 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఆల్ రౌండర్ గా సేవలు అందిస్తాడని స్టోక్స్ పైనే ఇంత భారీ మొత్తాన్ని సీఎస్కే కొనుగోలు చేసింది. ఎన్నో అంచనాల మధ్య ఈ ఏడాది క్యాస్ రిష్ లీగ్ లో అడుగుపెట్టిన బెన్ స్టోక్స్ ఆడిన తొలి మ్యాచ్ లోనే నిరాశపరిచాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 7 పరుగుుల మాత్రం చేసిన పెవిలియన్ చేరాడు. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో అదే ఆట తీరుతో ఈ టెస్ట్ కెప్టెన్ కొనసాగించాడు. ఈ మ్యాచ్ లో కేవలం 8 బంతుల్లో బెన్ స్టోక్స్ 8 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. బౌలింగ్ పరంగా రెండు ఓవర్లు వేసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ సెషన్ లో బెన్ స్టోక్స్ బొటనవేలికి గాయమైంది. దీంతో అతను తర్వాత మ్యాచ్ లకు దూరమయ్యాడు. కాగా అతడు గాయం నుంచి కోలుకోవడానికి మరో వారం రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.

Read Also : KTR: పార్లమెంట్‌ కి అంబేద్కర్ పేరుపెట్టాలి.. కేంద్రానికి కేటీఆర్‌ డిమాండ్‌

ఇక గాయం నుంచి కోలుకున్నా కానీ బెంచ్ కి పరిమితవ్వాలని స్టోక్స్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దానికీ కారణం లేకపోలేదు. ఈ సంవత్సరం జూన్ లో ప్రారంభమయ్య యాషెస్ సిరీస్ ను దృష్టిలో పెట్టుకుని స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ సమయానికి పుల్ ఫిట్ నెస్ తో ఉండాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నుంచి కూడా ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఇంగ్లండ్ టెస్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ సైతం స్టోక్స్ తో నిత్యం టచ్ లో ఉన్నట్లు ఈసీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో స్టోక్స్ మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ ల్లో సీఎస్కే తరపున ఆడేది అనుమానంగా మారింది. ఒకవేళ స్టోక్స్ టోర్నీ మొత్తానికి దూరమైతే.. సీఎస్కే పెట్టి రూ. 16.25 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు కావడం ఖాయం అని చెప్పుకోవాలి..

Read Also : Cradle Ceremony For Calf: ఏపీలో పెయ్య దూడకు ఉయ్యాల వేడుక..

Exit mobile version