ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ 5వ టెస్ట్ లో బెన్ స్టోక్ ఓ క్యాచ్ ను పట్టినట్టే పట్టి చేజార్చాడు. మొయిన్ అలీ బౌలింగ్ లో స్టీవ్ స్మిత్ క్యాచ్ ఇవ్వగా.. స్టోక్స్ దానిని డ్రాప్ చేశాడు. దీంతో స్టీవ్ స్మిత్ నాటౌట్ గా నిలిచాడు.
Manchu Manoj: అందుకే చంద్రబాబుతో భేటీ అయ్యా.. పొలిటికల్ ఎంట్రీ.. ?
స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తుండగా.. బంతి అతని బ్యాట్‌కు తగిలి లెగ్ స్లిప్ లో ఉన్న బెన్ స్టోక్స్ వద్దకు వెళ్లింది. ఆ బంతిని ఒక చేత్తో క్యాచ్ పట్టినప్పటికీ.. ఆ తర్వాతి క్షణం బంతి చేజారింది. దీంతో అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే బ్యాట్ కు బంతి తాకలేదని.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడని ఇంగ్లండ్ ఆటగాళ్లు భావించారు. వెంటనే ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ డీఆర్ఎస్ తీసుకున్నాడు. అయితే రీప్లేలో బంతి స్మిత్ బ్యాట్‌కు తగిలి స్టోక్స్ క్యాచ్ తీసుకున్నట్లు రీప్లేలో కనిపించింది. అయితే స్టోక్స్ పట్టిన క్యాచ్‌ను థర్డ్ అంపైర్ నిశితంగా పరిశీలించాడు. స్టోక్స్ క్యాచ్ పట్టినప్పటికీ.. దానిని పూర్తి చేయలేకపోయాడు. ఎందుకంటే అతను బంతిని క్యాచ్ పట్టిన తర్వాత మోషన్‌లో ఉన్నప్పుడు.. అతని కుడి చేయి అతని పాదాలను తాకింది. దాంతో బంతి స్టోక్స్ చేతిలో నుండి జారిపోయింది. అంపైర్ దానిని సరైన క్యాచ్‌గా పరిగణించకపోవడంతో నాటౌట్ ఇచ్చాడు.
Matrimony: పెళ్లి చేసుకుంటానంది.. రూ. కోటి కాజేసింది
అయితే స్టీవ్ స్మిత్ నాటౌట్‌గా అంపైర్ ప్రకటించడంతో ఓవల్‌లో మ్యాచ్ చూస్తున్న వేలాది మంది ఇంగ్లిష్ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ క్యాచ్ పై సోషల్ మీడియాలో ప్రశ్నల వెల్లువ కురిపిస్తున్నారు. మరోవైపు క్రికెట్ నిబంధనల ప్రకారం థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ నిర్ణయం సరైనదే. ICC నిబంధనల ప్రకారం.. బంతిని పట్టుకున్న తర్వాత, శరీరం యొక్క స్థానం పూర్తిగా పూర్తి కావాలి. ఇది బెన్ స్టోక్స్ విషయంలో కనిపించలేదు. నితిన్ మీనన్ నిర్ణయం ఖచ్చితంగా సరైనది కావడానికి ఇదే కారణం.
Out or not out? 🤷♂️ #EnglandCricket| #Ashes pic.twitter.com/q2XCJuUpxM
— England Cricket (@englandcricket) July 31, 2023