NTV Telugu Site icon

Bellamkonda Srinivas : ఆ ప్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్..?

Bellamkonda Srinivas

Bellamkonda Srinivas

Bellamkonda Srinivas :  టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అల్లుడు శీను సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్ తన డాన్స్ ,యాక్టింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. ఆ తరువాత వరుస సినిమాలతో మెప్పించిన ఈ యంగ్ హీరో తమిళ్ రీమేక్ మూవీ రాక్షసుడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.వరుస సినిమాలు చేస్తున్న హీరోగా బిగ్ బ్రేక్ ఇచ్చే సినిమా ఈ యంగ్ హీరోకు దొరకడం లేదు.అయితే ఈ యంగ్ హీరో తెలుగులో నటించిన సినిమాల హిందీ డబ్బింగ్ మూవీస్ కు యూట్యూబ్ లో భారీగా వ్యూస్ అండ్ లైక్స్ లభిస్తున్నాయి.దీనితో బాలీవుడ్ లో ఈ హీరోకు మంచి క్రేజ్ లభించింది.

Read Also :Pawan kalyan : రామోజీని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు కూలిపోయాయి..

దీనితో నేరుగా హిందీ సినిమాతో అక్కడి ప్రేక్షకులను మెప్పించాలని సిద్ధం అయ్యాడు.తెలుగులో ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి సినిమా హిందీ రీమేక్ అక్కడి ప్రేక్షకులను పలుకరించాడు.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ సినిమాను తెరకెక్కించారు.గత ఏడాది భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ డిజాస్టర్ గా నిలిచింది.దీనితో ఈ యంగ్ హీరో మళ్ళీ తెలుగులో సినిమా చేయడం మొదలు పెట్టాడు.ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ “టైసన్ నాయుడు” ఈ సినిమాను సాగర్.కె.చంద్ర తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిం గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో మరో ప్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు.”చావు కబురు చల్లగా” ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి తో ఓ ఫాంటసీ మూవీ చేయబోతున్నాడు.దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట.త్వరలోనే ఈ సినిమా మొదలు కానున్నది అని సమాచారం.

Show comments