Site icon NTV Telugu

Tyson Naidu : ‘టైసన్ నాయుడు’గా వస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్..

Whatsapp Image 2024 01 03 At 2.41.56 Pm

Whatsapp Image 2024 01 03 At 2.41.56 Pm

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాస్ హీరో గా గుర్తింపు తెచ్చుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు..హిందీలో ప్రభాస్ ‘ఛత్రపతి’ రీమేక్ చేసి డిజాస్టర్ అందుకున్నారు. దీనితో సాయి శ్రీనివాస్ తెలుగు తెరకు మూడు సంవత్సరాల విరామం ఇచ్చారు.ఇప్పుడు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించనున్నాడు.బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతుంది.సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో నటిస్తున్న సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ రోజు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను వెల్లడించారు.ఈ సినిమా టైటిల్ ’టైసన్ నాయుడు’ గా ఖరారు చేశారు.ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ లో 10వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది..ఈ మూవీ లో సాయి శ్రీనివాస్ పోలీస్ రోల్ చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘భీమ్లా నాయక్’ తర్వాత సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలతో ఆయన సినిమా రూపొందించినట్లు గ్లింప్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. ”సార్… బాగా బలిసిన దున్నపోతు రంకెలు వేస్తూ మీ ముందుకు వచ్చింది. మీరు గాల్లో ఎగురుతూ ఒక బ్లైండ్ క్లిక్ ఇచ్చారు. అప్పుడు ఏం జరుగుతుంది?” అని ఒకరు ప్రశ్నిస్తే… ”దున్నపోతు చచ్చిపోతుంది” అని ట్రైనింగ్ ఇస్తున్న వ్యక్తి సమాధానం ఇచ్చే డైలాగ్ తో గ్లింప్స్ మొదలవుతుంది.అలాగే ఈ సినిమాలో పంజాబ్, సిక్కుల నేపథ్యంలోని సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తుంది. ‘టైసన్ నాయుడు’ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్, వెంకట్ మరియు రియల్ సతీష్ మాస్టర్లు యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

Exit mobile version