NTV Telugu Site icon

Tyson Naidu : ‘టైసన్ నాయుడు’లుక్ రిలీజ్.. మరీ ఇంత రస్టిక్ గా ఉన్నావేం బెల్లంకొండ

New Project 2024 11 02t110647.704

New Project 2024 11 02t110647.704

Tyson Naidu : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాస్ హీరో గా గుర్తింపు తెచ్చుకునేందుకు ఎంతగానో కష్టపడుతున్నారు. హిందీలో ప్రభాస్ ‘ఛత్రపతి’ రీమేక్ చేసి డిజాస్టర్ అందుకున్నారు. దీనితో సాయి శ్రీనివాస్ తెలుగు తెరకు మూడేళ్ల పాటు విరామం ఇచ్చారు. ఇప్పుడు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించనున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతుంది. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో నటిస్తున్న సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు ’టైసన్ నాయుడు’అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ లో 10వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీ లో సాయి శ్రీనివాస్ పోలీస్ రోల్ చేస్తున్నారు.

Read Also:PGCIL Recruitment: భారీగా ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ లో ఉద్యోగాల భర్తీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘భీమ్లా నాయక్’ తర్వాత సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలతో ఆయన సినిమా రూపొందించినట్లు సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. ‘టైసన్ నాయుడు’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను దర్శకుడు సాగర్ కె చంద్ర పూర్తి రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ రస్టిక్ లుక్‌లోకి మారిపోయాడు. తాజాగా ఆయన లుక్‌కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ పోటోలు గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. యాక్షన్ సీక్వెన్స్‌లు హైలైట్‌గా తెరకెక్కుతున్న ‘టైసన్ నాయుడు’ మూవీలో అందాల భామలు నేహాశెట్టి, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.

Read Also:Love Cheating: డబ్బుల కోసం ప్రేమ వల.. రహస్యంగా పెళ్లి.. ఫోటోలతో బ్లాక్ మెయిల్..

Show comments