NTV Telugu Site icon

BEL Recruitment : భారత్‌ ఎలక్ట్రానిన్స్‌ లిమిటెడ్‌ లో భారీగా ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..

Bel Jobs

Bel Jobs

కేంద్ర ప్రభుత్వం వరుసగా నిరుద్యోగుల కు గుడ్ న్యూస్ చెబుతుంది.. గతంలో కంటే ఈ ఏడాది ఉద్యోగాలను పెంచింది.. ప్రభుత్వ కార్యాలయాల్లో పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసింది.. ఇప్పుడు మరో సంస్థ ఉన్న ఖాళీల ను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతుంది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిన్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 ప్రాజెక్ట్ ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగం లో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 32 ఏళ్లు మించకుండా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40 వేల జీతాన్ని ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. వివరాలిలా..

ఆసక్తి, అర్హత ఉన్న క్యాండిడేట్స్‌ ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల ను మేనేజర్‌ (హెచ్ఆర్/ఏడిఎస్ఎన్, ఈఎస్ అండ్ సి-క్యూఏ) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జలహళ్లి పోస్టు ఆఫీస్, బెంగళూరు 560013 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు 20 జులై 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.bel-india.in/ ను సందర్శించండి.. ఉద్యోగాలకు అప్లై చేసే ముందే నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోవాలి.. గతంలో ఈ సంస్థ నుంచి పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసింది కేంద్ర ప్రభుత్వం.. ఈ ఏడాది కూడా పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే రెండు మూడు సార్లు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కు కూడా అభ్యర్థుల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..

Show comments