Site icon NTV Telugu

BEL Recruitment 2023: బీఈఎల్ లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

bel jobs

bel jobs

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతూ వస్తుంది.. తాజాగా మరో సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రైనీ ఇంజనీర్ -I, ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్ -I ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 26ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు bel-india.in వెబ్ సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.. ఈ పోస్టులకు సంబందించిన ఖాళీలు మొత్తం..57

ట్రైనీ ఇంజనీర్-I (ఎలక్ట్రానిక్స్) 8
ట్రైనీ ఇంజనీర్ -I(మెకానికల్) 28
ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్-I(ఎలక్ట్రానిక్స్) 8
ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్-I(మెకానికల్) 8
ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్-I(సివిల్) 1
ప్రాజెక్ట్/ఇంజనీర్-1(హెచ్ఆర్) 1
ప్రాజెక్ట్ సైట్ 3

అర్హతలు : బీఈ/బీటెక్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇతర వివరాలను నోటిఫికేషన్ ను చదివి తెలుసుకోవచ్చు..

అప్లికేషన్ ఫీజు: ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు రూ.472, ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు రూ.177 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది..

ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలంటే?

1. అభ్యర్థులు ముందుగా bel-india.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి
2. హోం పేజీలో కెరీర్ ట్యాబ్ ను ఓపెన్ చేయాలి.
3. తర్వాత సంబంధిత పోస్టు అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
4. అప్లికేషన్ ఫామ్ ను నింపి, కావాల్సిన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయాలి.
5. అప్లికేషన్ ఫీజు చెల్లించాలి..
6. అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి.. భవిష్యత్ లో ఉపయోగ పడుతుంది..

Exit mobile version