Beggar Donates Money: బిచ్చగాడి గొప్ప మనసు.. వేల రూపాయలు విరాళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beggar Donates Money: ఎన్ని కోట్లు సంపాదించినా పిల్లికి కూడా భిక్షం పెట్టని వాళ్లున్న సమాజంలో బిచ్చం ఎత్తుకుంటూ కొన్ని వేల రూపాయలను విరాళంగా ఇచ్చాడు విశాఖపట్నానికి చెందిన ఓ బిచ్చగాడు. అతడి మంచి మనసును అర్థం చేసుకున్న వాళ్లంతా శభాష్ అని మెచ్చుకుంటున్నారు. తను మరో నలుగురికి ఆదర్శమంటూ కితాబిస్తున్నారు. భిక్షాటన చేస్తూ జీవిస్తున్న ఆ వ్యక్తి.. తన భవిష్యత్ గురించి ఆలోచించకుండా తన సంపాదనలో కొంత మొత్తాన్ని దానం చేస్తుండేవాడు. యాచకుడి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పురంధర్ 14 ఏళ్ల క్రితం విశాఖ నగరానికి వలస వచ్చాడు. అప్పటి నుంచి నక్కవానిపాలెంలోని ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం వెనుక ఉన్న స్నానాల గదినే నివాసంగా మార్చుకుని జీవితాన్ని గడుపుతున్నాడు. తన పొట్ట నింపుకునేందుకు ఆ ఆలయం వద్దనే భిక్షాటన చేస్తున్నాడు.
Read Also: Water Overflowing From a Borewell : కరువు సీమలో అద్భుతం.. బోరు నుంచి ఉప్పొంగుతున్న నీరు
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
తన దుస్తులతో పాటు తాను సంపాదించిన నగదును కూడా ఆ బాత్ రూమ్ లోనే దాస్తుంటాడు. అయితే ఇటీవల ఆలయ పూజారి బాత్ రూమ్ లో ఉన్న పురంధర్ బట్టలను ఇతర సామాగ్రిని బయటకు విసిరేశాడు. మూటలో ఉన్న నగదు చెల్లాచెదురుగా పడిపోయింది. అలా పడిన డబ్బులను చూసి పూజారి సహా అక్కడ ఉన్నవారు షాక్ తిన్నారు. వెంటనే ఆలయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు యాచకుని ఆరా తీశారు. దీంతో పురంధర్ దగ్గర ఉన్న డబ్బులు భక్తులు ధర్మం చేసిందేనని తేలింది. మొత్తాన్ని లెక్కించగా లక్ష రూపాయలకు పైగానే ఉంది. దీంతో పురంధర్ అందులోని సగం సొమ్మును స్వామి వారికి విరాళంగా సమర్పించుకున్నాడు. రూ. 50 వేల విలువైన నాణేలను హుండీలో వేశారు. మిగిలిన సగం తనకు అనారోగ్యం చేస్తే వైద్య ఖర్చుల కోసం దాచుకుంటానని వెల్లడించాడు.
- Tags
- Beggar
- donate
- money
- Temple
- Visakhapatnam
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!