Site icon NTV Telugu

Beetroot Benefits : బీట్ రూట్ జ్యూస్ ను ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Beet Root Juice

Beet Root Juice

మనం నిత్యం వాడే కూరగాయలలో బీట్ రూట్ కూడా ఒకటి.. కొందరికి ఈ మట్టి వాసన నచ్చక అసలు బీట్ రూట్ లను తినడమే మానేస్తారు.. యాంటీఆక్సిడెంట్లు, ఎలక్ట్రోలైట్లు ఇంకా ఎన్నో పోషకాలున్నాయ్. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు ప్రతీరోజూ బీట్‌రూట్ తాగితే రక్తహీనత అస్సలు ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయితే బీట్ రూట్ ను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బీట్ రూట్ జ్యూస్ ను గర్భిణీలు రోజూ తీసుకోవడం వల్ల కడుపులో బిడ్డ ఎదుగుదలకు ఫొలేట్, బి విటమిన్ చాలా అవసరమౌతుంది. అందుకే వాళ్లను రోజూ ఈ జ్యూస్ ను తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.. అలాగే బీట్‌రూట్‌లో ఉండే బెటానిన్ ఆ కొవ్వును తగ్గిస్తుంది. బరువు ఎక్కువగా ఉన్నవారు బీట్‌రూట్ జ్యూస్ తాగితే తగ్గే అవకాశం ఉంది..

రక్తపోటు అదుపులో ఉంటుంది.. రక్తపోటును తగ్గించే నైట్రేట్ పోషకం ఉంటుంది. హైపర్‌టెన్షన్‌తో సతమతమయ్యేవారికి ఇది ఉపయోగపడుతుంది.. అంతేకాదు.. బీట్‌రూట్‌లో బెటాలైన్లతో పాటు మరికొన్ని యాంటీ ఆక్సిడెంట్లుంటాయ్. క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను, హానికర బ్యాక్టీరియాలను ఈ బెటలైన్లు నాశనం చేస్తాయి.. లివర్ పై కొవ్వు పేరుకో పోకుండా కాపడుతుంది.. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది.. నరాలు, కండరాల సమస్యలను తగ్గించడానికి ఇది బాగా సహాయ పడుతుంది.. చర్మ రక్షణలో కూడా బాగా దోహదపడుతుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version