NTV Telugu Site icon

Beer Tanning: ‘బీర్ టానింగ్’ ట్రెండ్ అంటే ఏంటి.. వద్దంటూ నిపుణులు ఎందుకు హెచ్చరిస్తున్నారు?

Beer Tanning

Beer Tanning

Beer Tanning is Good Or Bad for Skin: ప్రస్తుత రోజులో ప్రతి ఒక్కరు చర్మ సౌందర్యాన్ని కోరుకుంటున్నారు. ఆడ-మగ, చిన్నా-పెద్ద అనే తేడా లేకుండా అందరూ తాము అందంగా కనబడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ‘టాన్‌’ సమస్య ఉన్నవారు అయితే చేయని ప్రయత్నం అంటూ ఉండదు. చివరకు ప్రకృతిని కూడా వదలరు. ఇటీవలి కాలంలో ‘బీర్ టానింగ్’ ట్రెండ్ బాగా పౌలర్ అయింది. అయితే ఇప్పుడు టిక్‌టాక్‌లో ట్రెండ్ అవుతున్న ఈ బీర్ టానింగ్ వద్దంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఈ ‘బీర్ టానింగ్’ ట్రెండ్ అంటే ఏంటి?, నిపుణులు ఎందుకు వద్దని హెచ్చరిస్తున్నారు? అనే విషయాలు తెలుసుకుందాం.

బీర్ టానింగ్ అంటే ఏంటి:
బీర్ టానింగ్ అంటే.. బీర్ షవర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. చర్మాన్ని అందంగా, మృదువుగా మార్చుకోవడం కోసం బీర్‌తో స్నానం చేయడం. చాలా మంది ప్రజలు సూర్యరశ్మి తమ శరీరంపై పడడానికి బీచ్‌లకు వెళతారు. ఇక గోల్డెన్ టాన్ సాధించడం కోసం బీర్‌ను శరీరం అంతటా రుద్దుకుని.. సూర్యరశ్మిలో ఉంటారు. ఇందుకు బీచ్‌లను ఎక్కువగా ఎంచుకుంటారు. ఇదే ఇప్పుడు ట్రెండ్. సూర్యరశ్మి, ఆల్కహాల్ (బీర్‌లోని హాప్‌లు, బార్లీ) వల్ల చర్మం అందంగా, మృదువుగా తయారవుతుందని భావిస్తున్నారు.

హెచ్చరిస్తున్న నిపుణులు:
టిక్‌టాక్‌లో ‘బీర్ టాన్’ ట్రెండ్ రోజరోజుకూ పెరుగుతోంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడానికి ఒక సాధారణ పద్ధతి. బీర్‌లోని హాప్‌లు మెలనిన్‌ను సక్రియం చేయడంలో సహాయపడతాయని అందరూ భావిసున్నారు. బీర్ టాన్ ఓ సాధారణ పద్దతి అయినప్పటికీ.. మీ ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలను కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. బీర్ టాన్ ప్రక్రియ చర్మాన్ని దెబ్బతీయడమే కాకుండా.. చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొంటున్నారు. బీర్ షవర్ వల్ల వచ్చే సమస్యలను ఓసారి చూద్దాం. (5 Reasons You Might Want To Skip Beer Tanning TikTok Trend)

బీర్ షవర్ వల్ల వచ్చే సమస్యలు ఇవే (Beer Tanning Disadvantages):
అలెర్జీ:
బీర్‌లో హాప్స్, బార్లీ మరియు ఈస్ట్ వంటి పదార్థాలు ఉంటాయి. బీర్ టాన్ చేయడం వలన కొంతమంది వ్యక్తులలో అలెర్జీకి దారి తీస్తుంది. బీర్‌ను నేరుగా చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం ఎరుపు మారి అలెర్జీ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి.

పొడి చర్మం:
బీర్‌ చర్మానికి పూసినప్పుడు తేమను తొలగిస్తుంది. అప్పడు చర్మం పొడిగా మారి సూర్యరశ్మి వల్ల దెబ్బతినే అవకాశం ఉంది.

Also Read: Redmi 12 5G Launch: 11 వేలకే రెడ్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్.. 50 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ!

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు:
మీ శరీరంపై బీర్ రాసినపుడు జిగట అవశేషాలు బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. బీర్ టానింగ్ వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి.. మొటిమలు ఏర్పడతాయి. అంతేకాదు చర్మ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.

పీహెచ్ బ్యాలెన్స్:
బీర్ యొక్క ఆమ్ల స్వభావం చర్మం యొక్క పీహెచ్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. పీహెచ్ ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. పీహెచ్ బ్యాలెన్స్ తప్పితే చర్మం పొడిబారడం, మంట మరియు చికాకులకు గురవుతారు.

డీహైడ్రేటెడ్ స్కిన్:
బీర్ చర్మం యొక్క సహజ తేమ సమతుల్యతకు భంగం కలిగిస్తుంది. దాంతో చర్మం పొడిబారడం, ఫ్లాకీనెస్ మరియు వడదెబ్బకు గురయ్యే అవకాశం పెరుగుతుంది. నిర్జలీకరణ చర్మం వలన వృద్ధాప్య ఛాయలు వస్తాయి. తద్వారా మీరు పెద్దవయసు వారిలా కనిపిస్తారు.

చర్మ క్యాన్సర్:
బీర్ టానింగ్ వలన చర్మ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువ అని చర్మవ్యాధి నిపుణులు అంటున్నారు. బీర్ షవర్ వలన చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందట.

Also Read: WI vs IND: 200 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన వెస్టిండీస్‌.. టీమిండియాదే వన్డే సిరీస్‌!