NTV Telugu Site icon

Beer Drinkers: ఈ దేశ ప్రజలు బీరు బాటిళ్లతో కాదు.. బక్కెట్లు, బిందెల కొద్ది తాగుతున్నారు

Beer Consumption In India

Beer Consumption In India

Beer Drinkers: వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రపంచంలో అత్యధికంగా బీర్ తాగే దేశాల జాబితాను విడుదల చేసింది. డేటా ప్రకారం చెక్ రిపబ్లిక్లో ప్రజలు ఎక్కువ మోతాదులో బీరు తాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రజలు ఆల్కహాల్ కేటగిరీలో బీరును ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు. చెక్ రిపబ్లిక్‌లో ఒక వ్యక్తి ఏడాదికి 140 లీటర్ల బీరు తాగుతున్నాడు. నెలవారీగా చూస్తే.. ఒక వ్యక్తి నెలలో పదకొండున్నర లీటర్ల బీరు తాగుతున్నాడు. ఈ విషయంలో భారత దేశం చాలా వెనుకబడి ఉంది.

టాప్ 10లో 9 యూరోపియన్ దేశాలు
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం అత్యధికంగా బీర్ వినియోగించే దేశాల జాబితాలో 10 దేశాలలో తొమ్మిది యూరప్‌కు చెందినవి. అగ్ర దేశాలలో చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, రొమేనియా, జర్మనీ, పోలాండ్, ఐర్లాండ్, స్పెయిన్, క్రొయేషియా, లాట్వియా ఉన్నాయి. టాప్ 10లో ఉన్న ఏకైక నాన్-యూరోపియన్ దేశం నమీబియా. నమీబియాలో ప్రతి వ్యక్తి ఏడాదికి 95.5 లీటర్ల బీరు తాగుతాడు.

ఇది దేశాల ర్యాంకింగ్

రెండో స్థానంలో ఆస్ట్రియా
ఆ తర్వాత ఆస్ట్రియా రెండో స్థానంలో నిలిచింది. ఈ దేశంలో ప్రతి వ్యక్తి ఏడాదికి 107.8 లీటర్ల బీరు తాగుతున్నాడు. రొమేనియాలో ఒక వ్యక్తి 100.3 లీటర్లు, జర్మనీలో 99.8 లీటర్లు మరియు పోలాండ్‌లో 97.7 లీటర్లు. ఐర్లాండ్‌లోని ప్రతి వ్యక్తి ఏడాదికి 92.9 లీటర్ల బీరు తాగుతున్నారు. అదేవిధంగా, స్పెయిన్‌లో తలసరి వార్షిక బీర్ వినియోగం 88.8 లీటర్లు, క్రొయేషియాలో 85.5 లీటర్లు, లాట్వియాలో 81.4 లీటర్లు. దీని తర్వాతి స్థానాల్లో ఎస్టోనియా (80.5 లీటర్లు), స్లోవేనియా (80 లీటర్లు), నెదర్లాండ్స్ (79.3 లీటర్లు), బల్గేరియా (78.7 లీటర్లు), పనామా (78.3 లీటర్లు), ఆస్ట్రేలియా (75.1 లీటర్లు), లిథువేనియా (74.4 లీటర్లు) ఉన్నాయి.

బీర్ వినియోగం విషయంలో భారత్ చాలా తక్కువ. భారతదేశంలో సగటు వ్యక్తి ఏడాదికి రెండు లీటర్ల బీరు తాగుతాడు. కేవలం ఇండోనేషియా మాత్రమే భారతదేశానికి దిగువన ఉంది. ఇస్లామిక్ దేశం ఇండోనేషియాలో తలసరి వార్షిక వినియోగం 0.70 లీటర్లు మాత్రమే.