NTV Telugu Site icon

Viral Video: ప్లేట్ లో ఆహారం తిన్న ఎలుగుబంటి.. కొడుకును తల్లి ఎలా కాపాడుకుందో చూడండి

Bear

Bear

అడవి జంతువులను దూరం నుంచి చూడటానికి చాలా బాగుంటుంది. అదే అవి మన దగ్గరకు వస్తే పై ప్రాణం పైనే పోయినట్లు అనిపిస్తుంది.  ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది పిక్నిక్ కు వెళ్లిన ఓ తల్లి కొడుకుకు. వారు ఆహారం తింటున్న టేబుల్ పైకి అనుకోకుండా ఓ ఎలుగుబంటి వచ్చింది. వారి ప్లేట్స్ లో ఉన్న మొత్తం ఆహారాన్ని తినేసింది. దీంతో ఆ తల్లి కొడుకు భయంతో వణికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జంతువులను ఇష్టపడే వారు ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఈ ఘటన మెక్సికోలోని చిపింక్యూ ఎకోలాజికల్ పార్క్‌లో చోటు చేసుకుంది.

Also Read: Ganesh Chathurthi: విఘ్నేశ్వరునికి తులసి ఆకులతో పూజ చేయకూడదు ఎందుకో తెలుసా..?

పిక్నిక్ ను ఎంజాయ్ చేయడానికి ఓ మహిళ తన కుటుంబంతో కలిసి మెక్సికోలోని చిపింక్యూ ఎకోలాజికల్ పార్క్ కు వెళ్లింది. అక్కడ వారి కుటుంబంతో కలిసి భోజనం చేస్తుండగా సడెన్ గా ఓ ఎలుగుబంటి వారి టేబుల్ పైకి ఎక్కి వారి ఆహారాన్ని తినడం ప్రారంభించింది. ఆ టేబుల్ దగ్గర తల్లికొడుకు మాత్రమే ఉన్నారు. వారికి ఎదురుగా ఆమె కుమార్తె ఉంది. ఈ వీడియో మొత్తాన్ని ఆమె చిత్రీకరించింది. అయితే ఎలుగుబంటి రావడంతో ఆ తల్లి నిశ్శబ్ధంగా ఉండిపోయింది. తన కొడుకు చిన్నవాడు కావడంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా అతడి కళ్లను మూసి గుండెలకు హత్తుకొని అలాగే ఉండిపోయింది. దీంతో ఆ ఆహారం మొత్తం తిన్న ఎలుగుబంటి వారికి ఎటువంటి హాని చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో చూసిన వారు ఆ తల్లి తన బిడ్డను కాపాడుకున్న విధానం చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన కొడుక్కు ప్రమాదం జరగకుండా ఆ తల్లి చాలా జాగ్రత్త తీసుకుంది అంటూ పొగడ్తలతో ముచ్చె్త్తుతున్నారు. ఇక ఆ పార్క్ లో పెరుగుతున్న ఎలుగుబంటి దాడుల గురించి నిర్వాహకులు ఇటీవల హెచ్చరికలు కూడా జారీ చేశారు. పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతలోనే ఎలుగుబంటికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.