Viral Video: ప్లేట్ లో ఆహారం తిన్న ఎలుగుబంటి.. కొడుకును తల్లి ఎలా కాపాడుకుందో చూడండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అడవి జంతువులను దూరం నుంచి చూడటానికి చాలా బాగుంటుంది. అదే అవి మన దగ్గరకు వస్తే పై ప్రాణం పైనే పోయినట్లు అనిపిస్తుంది. ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది పిక్నిక్ కు వెళ్లిన ఓ తల్లి కొడుకుకు. వారు ఆహారం తింటున్న టేబుల్ పైకి అనుకోకుండా ఓ ఎలుగుబంటి వచ్చింది. వారి ప్లేట్స్ లో ఉన్న మొత్తం ఆహారాన్ని తినేసింది. దీంతో ఆ తల్లి కొడుకు భయంతో వణికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జంతువులను ఇష్టపడే వారు ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఈ ఘటన మెక్సికోలోని చిపింక్యూ ఎకోలాజికల్ పార్క్‌లో చోటు చేసుకుంది.
Also Read: Ganesh Chathurthi: విఘ్నేశ్వరునికి తులసి ఆకులతో పూజ చేయకూడదు ఎందుకో తెలుసా..?
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
పిక్నిక్ ను ఎంజాయ్ చేయడానికి ఓ మహిళ తన కుటుంబంతో కలిసి మెక్సికోలోని చిపింక్యూ ఎకోలాజికల్ పార్క్ కు వెళ్లింది. అక్కడ వారి కుటుంబంతో కలిసి భోజనం చేస్తుండగా సడెన్ గా ఓ ఎలుగుబంటి వారి టేబుల్ పైకి ఎక్కి వారి ఆహారాన్ని తినడం ప్రారంభించింది. ఆ టేబుల్ దగ్గర తల్లికొడుకు మాత్రమే ఉన్నారు. వారికి ఎదురుగా ఆమె కుమార్తె ఉంది. ఈ వీడియో మొత్తాన్ని ఆమె చిత్రీకరించింది. అయితే ఎలుగుబంటి రావడంతో ఆ తల్లి నిశ్శబ్ధంగా ఉండిపోయింది. తన కొడుకు చిన్నవాడు కావడంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా అతడి కళ్లను మూసి గుండెలకు హత్తుకొని అలాగే ఉండిపోయింది. దీంతో ఆ ఆహారం మొత్తం తిన్న ఎలుగుబంటి వారికి ఎటువంటి హాని చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో చూసిన వారు ఆ తల్లి తన బిడ్డను కాపాడుకున్న విధానం చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన కొడుక్కు ప్రమాదం జరగకుండా ఆ తల్లి చాలా జాగ్రత్త తీసుకుంది అంటూ పొగడ్తలతో ముచ్చె్త్తుతున్నారు. ఇక ఆ పార్క్ లో పెరుగుతున్న ఎలుగుబంటి దాడుల గురించి నిర్వాహకులు ఇటీవల హెచ్చరికలు కూడా జారీ చేశారు. పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతలోనే ఎలుగుబంటికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
A family was stunned when an intruding bear hopped onto their table to devour their food. The eldest daughter captured the scene as the bear continued munching away in Parque Ecológico Chipinque in San Pedro, Mexico 🇲🇽. The mother, as seen in the video, remained calm, shielding… pic.twitter.com/o47OkJQsNr
— Voyage Feelings (@VoyageFeelings) September 27, 2023
- Tags
- Bear
- Mexico
- viral video
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!