Site icon NTV Telugu

World Cup 2025 గెలిచినా విక్టరీ పరేడ్ లేదా..? BCCI ఏమందంటే..?

World Cup 2025

World Cup 2025

World Cup 2025 BCCI: హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించినా.. ఇప్పటి వరకు విక్టరీ పరేడ్ (అభినందన కార్యక్రమం) ఏదీ..? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI)కి ఎందుకు ఆ విపక్ష. దక్షిణాఫ్రికాపై ఫైనల్‌లో విజయం సాధించి టీమిండియా మొదటిసారి మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ అద్భుతమైన విజయానికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ.. బీసీసీఐ పరేడ్ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి షెడ్యూల్ చేయలేదు. అయితే ఈ విషయమై.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ధృవీకరిస్తూ.. ప్రస్తుతం బోర్డుకు ఇతర ముఖ్యమైన పనులు ఉన్నాయని తెలిపారు.

NSEలో కొత్త మార్పు.. ఈక్విటీ డెరివేటివ్స్ (F&O) సెగ్మెంట్‌లో ప్రీ-ఓపెన్ సెషన్.. వివరాలు ఇలా..!

నివేదిక ప్రకారం సీనియర్ అధికారులు దుబాయ్‌లో జరగబోయే ఐసీసీ సమావేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాతే వేడుకలు షెడ్యూల్ చేయబడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశాలు నవంబర్ 4 నుండి 7 వరకు జరగనున్నాయి. దానితో భారత మహిళల జట్టు తమ ప్రపంచకప్ విజయాన్ని అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి కనీసం ఒక వారం వరకు వేచి ఉండక తప్పేలాలేదు.

The Girlfriend : రష్మికతో పని చేయడం ఓ అందమైన అనుభవం: హీరో దీక్షిత్‌ శెట్టి

ఇదిలా ఉండగా.. ఆసియా కప్ ట్రోఫీకి సంబంధించిన వివాదాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) దృష్టికి తీసుకెళ్లి దానిని గౌరవప్రదంగా తిరిగి పొందడానికి ప్రయత్నిస్తామని సైకియా తెలిపారు. మేము ఆసియా కప్ ట్రోఫీ విషయాన్ని ఐసీసీతో చర్చిస్తామని.. ఆ ట్రోఫీకి లభించాల్సిన గౌరవం, మర్యాదతో దానిని తిరిగి పొందుతామని ఆయన అన్నారు. సెప్టెంబర్ 28న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు పాకిస్థాన్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన వెంటనే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చైర్మన్, పాకిస్థాన్ అంతర్గత మంత్రి అయిన మోహ్సిన్ నఖ్వి నుండి 2025 పురుషుల T20 ఆసియా కప్ ట్రోఫీని అంగీకరించడానికి టీమిండియా నిరాకరించింది. దీనితో ట్రోఫీని నఖ్వి నుండి తీసుకోకూడదనే నిర్ణయం.. ఇరు దేశాల మధ్య గతంలో ఉన్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా తీసుకున్నారు.

Exit mobile version