Site icon NTV Telugu

women’s World Cup 2025: BCCI ఓపెన్ ఆఫర్.. ప్రపంచ కప్ గెలిస్తే రూ.125 కోట్లు గిఫ్ట్ !

Bcci 125 Crore Reward

Bcci 125 Crore Reward

women’s World Cup 2025: చరిత్ర సృష్టించే దిశగా భారత మహిళా క్రికెట్ జట్టు దూసుకుపోతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా జట్టుకు బీసీసీఐ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఆదివారం నవీ ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో గెలిస్తే, గత ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు అందుకున్న మొత్తాన్ని మహిళా జట్టుకు ఇవ్వాలని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

READ ALSO: Pan Card: ఈ పని చేయకపోతే.. జనవరి 1 నుంచి పాన్ కార్డ్ ఉపయోగించలేరు..!

గత ఏడాది T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత పురుషుల జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి BCCI ₹125 కోట్ల బహుమతిని అందించింది. పేరు వెల్లడించడానికి ఇష్టపడని BCCI అధికారి ఒకరు మాట్లాడుతూ.. “BCCI పురుషులు, మహిళలకు సమాన వేతనాన్ని అందజేయడానికి మద్దతు ఇస్తుంది. దీంతో అమ్మాయిలు ప్రపంచ కప్ గెలిస్తే, పురుషుల ప్రపంచ కప్ గెలిచిన దానికంటే తక్కువ కాదని చాలా చర్చలు జరుగుతున్నాయి. కానీ కప్ గెలవడానికి ముందు ఈ బహుమతిని ప్రకటించడం సరైనది కాదు” అని ఆయన అన్నారు. 2017 ప్రపంచ కప్ ఫైనల్లో లార్డ్స్‌లో ఇంగ్లాండ్ చేతిలో భారత మహిళా జట్టు 9 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత, భారత జట్టుకు BCCI ₹50 లక్షల బహుమతిని అందజేసింది. ఎనిమిది ఏళ్ల తరువాత, భారత మహిళలు ప్రపంచ కప్ గెలిస్తే, వాళ్లకు బీసీసీఐ బహుమతి డబ్బులను 10 రెట్లు పెంచవచ్చని చెబుతున్నారు.

సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి భారత్ మహిళల జట్టు ప్రపంచ కప్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. తొలిసారి ప్రపంచ కప్ గెలవడానికి టీమ్ ఇండియాకు ఇది సువర్ణావకాశం అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గత 20 ఏళ్లుగా ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోతోంది. 2005లో భారత్ గెలిచింది. దీని తర్వాత రెండు జట్లు 20 ఏళ్లలో ప్రపంచ కప్‌లో మూడుసార్లు తలపడ్డాయి. ఈ మూడుసార్లు భారత జట్టు ఓటమిని చవిచూసింది. ఈ ప్రపంచ కప్‌లో కూడా లీగ్ దశలో భారత్ దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఆదివారం ఏం జరుగుతుందో అని క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

READ ALSO: Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T షూటింగ్ కంప్లీట్.. రిలీజ్ ఎప్పుడంటే!

Exit mobile version