NTV Telugu Site icon

Devdutt Padikkal In BGT: ఇదేమి ట్విస్ట్ మామ.. పెర్త్ టెస్టులో ఆడనున్న దేవదత్ పడిక్కల్

Devdutt Padikkal

Devdutt Padikkal

Devdutt Padikkal In BGT: మరో 24 గంటల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (BGT) 2024 – 25 ప్రారంభమవుతుంది. అయితే, దీనికి ముందు టీమిండియాలో గాయం ఆందోళన అభిమానులను టెన్షన్ పెంచింది. ఇది ఇలా ఉండగా.. నవంబర్ 22న ప్రారంభమయ్యే పెర్త్ టెస్టుకు ముందు బీసీసీఐ పెద్ద ప్రకటన చేసింది. గాయపడిన శుభమాన్ గిల్ స్థానంలో కొత్త ఆటగాడికి జట్టులో అవకాశం లభించింది. ఇంగ్లండ్‌తో జరిగిన అరంగేట్రంలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన దేవదత్ పడిక్కల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (BCCI) సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ టీమ్ ఇండియాకు అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను 65 పరుగుల మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇటీవల పడిక్కల్ భారతదేశం A తరపున ఆడుతున్నప్పుడు, ఆస్ట్రేలియా A పై అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. దింతో అతనికి భారత జట్టులో అవకాశం దక్కింది. ఆస్ట్రేలియా Aపై పడిక్కల్ 36, 88, 26, 1 పరుగులు చేశాడు. అయితే, భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో అతనికి అవకాశం లభిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడడం లేదు. దీనితో జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రెండు రోజుల క్రితం రోహిత్ శర్మ రెండోసారి తండ్రైన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ టోర్నమెంట్లో పాల్గొనే ఇరు జట్ల ఆటగాళ్ల లిస్ట్ ఇలా ఉంది.

భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (wk), సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి.

ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్టార్చ్, మచెల్.

భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన (నవంబర్ 2024 – జనవరి 2025) ఇలా సాగనుంది.
* 22-26 నవంబర్: 1వ టెస్టు, పెర్త్
* 6-10 డిసెంబర్: 2వ టెస్టు, అడిలైడ్
* 14-18 డిసెంబర్: 3వ టెస్టు, బ్రిస్బేన్
* 26-30 డిసెంబర్: 4వ టెస్టు, మెల్బోర్న్
* 03- 07 జనవరి: ఐదవ టెస్ట్, సిడ్నీ.