NTV Telugu Site icon

WPL 2023: వేలంలో మొత్తం 409మంది.. రూ.50లక్షల కేటగిరీలో మంధాన, హర్మన్

Fsd

Fsd

విమెన్స్ ఐపీఎల్‌కు సంబంధించిన వేలం ప్రక్రియపై బీసీసీఐ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఫిబ్రవరి 13న జరగబోయే ఈ మెగా వేలంలో మొత్తం 409 మంది మహిళా క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారని తెలిపింది. ఈ వేలానికి సంబంధించిన ఫైనల్ లిస్ట్‌ను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. దీని ప్రకారం మొత్తం 1,525 మంది క్రికెటర్లు వేలం కోసం తమ పేర్లు రిజిస్టర్ చేసుకోగా.. 409 మంది ప్లేయర్లు తుది లిస్టులో చోటు సంపాదించారు. ఇందులో 246 మంది భారత ప్లేయర్లు, 163మంది విదేశీ ప్లేయర్లతో పాటు 8మంది అసోసియేట్ దేశాల వారు ఉన్నారు. అలాగే 202 మంది క్యాప్‌డ్ ప్లేయర్లు ఇందులో చోటు దక్కించుకోగా.. 199 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు వేలంలో భాగం కానున్నారు. ఈ వేలం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ నెల 13న మధ్యాహ్నం 2.30గం.కు ప్రారంభమవుతుంది. ఇక ఈ లీగ్ మొదటి సీజన్ మార్చి 4-26 వరకు ముంబైలోని బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాల్లో జరగనుంది.

Also Read: Boeing layoff: బోయింగ్‌లోనూ ఉద్యోగాల కోత.. 2000 మందికి ఉద్వాసన!

మొత్తం ఐదు ఫ్రాంచైజీలు కలిపి 90 మంది ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది. ఇందులో 30 మంది విదేశీ ప్లేయర్లు ఉంటారు. ఈ వేలంలో రూ.50 లక్షల బేస్ ప్రైస్ అనేద ప్రథమ కేటగిరీ. ఈ కేటగిరీలో మొత్తం 24 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు స్మృతి మంధాన, దీప్తి శర్మ, ఇటీవలే అండర్-19 ప్రపంచకప్‌లో జట్టును విజేతగా నిలిపిన సారథి షెఫాలీ వర్మ ఈ కేటగిరీలోనే ఉన్నారు. అలాగే ఎలిస్ పెర్రీ, సోఫీ ఎక్లెస్టోన్, సోఫీ డివైన్, డియాండ్రా డాటిన్‌ వంటి స్టార్ విదేశీ ప్లేయర్లూ ఈ కేటగిరీలో చోటు సంపాదించారు. ఇక రెండోదైన రూ.40 లక్షల బేస్‌ప్రైస్‌లో 30 మంది ప్లేయర్లకు అవకాశం లభించింది.