Site icon NTV Telugu

India U19 Squad: ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు

Team India

Team India

భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత అండర్-19 జట్టును ప్రకటించింది. జట్టు కమాండ్ బాధ్యతలను మరోసారి కెప్టెన్ ఆయుష్ మాత్రేకు అప్పగించారు. విహాన్ మల్హోత్రాను వైస్-కెప్టెన్‌గా నియమించారు. ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుతంగా రాణించిన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని కూడా జట్టులో స్థానం సంపాదించాడు. ఈ పర్యటన సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభమై అక్టోబర్ 10 వరకు కొనసాగుతుంది. భారత్- ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో మూడు వన్డేలు, రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. ఇటీవల, ఇంగ్లాండ్ పర్యటనలో భారత అండర్-19 జట్టు అద్భుతంగా రాణించింది. ఐదు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌లో, భారత్ ఇంగ్లాండ్‌ను 3-2 తేడాతో ఓడించగా, రెండు యూత్ టెస్టులు డ్రా అయ్యాయి. నాల్గవ వన్డేలో, సూర్యవంశీ, విహాన్ సెంచరీలతో రాణించారు. భారత్ మొదట బ్యాటింగ్ చేసి 363 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది.

Also Read:Gang R*ape: మైనర్ బాలిక పై ఐదుగురు మైనర్ ల గ్యాంగ్ రే*ప్

వన్డే తేదీలు: సెప్టెంబర్ 21, సెప్టెంబర్ 24, సెప్టెంబర్ 26

నాలుగు రోజుల మ్యాచ్ తేదీలు: సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు, అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 10 వరకు

Also Read:OG : ఓజీ మొదటి పాటకు కౌంట్‌డౌన్ షురూ.. డేట్ ఇదేనా ?

భారత అండర్-19 జట్టు: ఆయుష్ మ్హత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, నమన్ పుష్పక్, హెనిల్ పటేల్, డి. దీపేష్, కిషన్ కుమార్, అన్మోల్జిత్ సింగ్, ఖిలాన్ పటేల్, ఉద్ధవ్ మోహన్, అమన్ చౌహాన్.

స్టాండ్‌బై ప్లేయర్స్: యుధాజిత్ గుహ, లక్ష్మణ్, బికె కిషోర్, అలంకృత్ రాపోల్, అర్నాబ్ బుగ్గ.

Exit mobile version