Site icon NTV Telugu

Bathukamma In Canada: కెనడాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. భారీగా హాజరైన ప్రవాస తెలుగు ప్రజలు

Tdf

Tdf

Bathukamma In Canada: తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్ (TDF) కెనడా ఆధ్వర్యంలో టోరంటోలోని బ్రాంప్టన్ నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. భారీ సంఖ్యలో ఎన్ఆర్ఐలు కుటుంబ సమేతంగా హాజరై ఆట, పాటలతో బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్, కెనడా నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేసి, పసందైన తెలంగాణా వంటకాలతో భోజనాలు కూడా ఏర్పాటు చేసారు. కెనడాలోనే పుట్టిపెరిగిన తెలుగు పిల్లలు మన పండగల ప్రత్యేకత తెలుసుకోవటం ఇలాంటి కార్యక్రమాలతో సాధ్యమౌతుందని టీడీఎఫ్ ప్రతినిధులు తెలిపారు.

Myanmar Earthquake: మయన్మార్‌లో భూకంపం.. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు!

ఈ కార్యక్రమంలో టీడీఫ్ కెనడా ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి గార్లపాటి, ఫౌండేషన్ కమిటీ చైర్మన్ సురేందర్ పెద్ది, అమితా రెడ్డి, టీడీఫ్ కెనడా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గంటా రెడ్డి మాణిక్ రెడ్డి స్మారక విశేష సేవా పురస్కారాన్ని మహేష్ మాదాడి, రజిని దంపతులకు టీడీఫ్ కెనడా కమిటీ తరపున అందజేశారు. 21 సంవత్సరాల నుండి కెనడాలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడానికి తోడ్పాడుతున్న ప్రతీ ఒక్కరికి టీడీఎఫ్ కెనడా కమిటీ ధన్యవాదములతో అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపింది.

Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిగా దర్శనం ఇస్తున్న అమ్మవారు..

Exit mobile version