NTV Telugu Site icon

Balakrishana : త్వరలో ఆంధ్రాలో బసవతారకం హాస్పిటల్ ప్రారంభిస్తాం..

Balayya

Balayya

Balakrishana :  బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ 24వ వార్షికోత్సవ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.అలాగే ఈ కార్యక్రమానికి బసవతారకం కాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు అలాగే డా.నోరి దత్తాత్రేయుడు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.బసవతారకం హాస్పిటల్ ఎంతో మంది పేదలకు సేవలందిస్తోందని ఆయన తెలిపారు. నిస్వార్థంగా పేదలకు సేవలందించేందుకే ఈ హాస్పిటల్ నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ సంస్థకు అనుమతులపై తన దృష్టికి రాగానే కేబినెట్‌లో చర్చించి పరిష్కరించామని ఆయన వెల్లడించారు.

Read Also :Indian 2 : అంతంత మాత్రంగానే ఇండియన్ 2 బిజినెస్..

హిందూపూర్ ఎంఎల్ఏ, బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ ఛైర్మెన్ బాలకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అందరికి ఆదర్శం.ఆయన ఈ వేడుకకు రావడం ఎంతో ఆనందంగా వుంది .స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎంతో దూర దృష్టి కలిగిన వ్యక్తి.. మంచి ఆలోచన తో ఈ హాస్పిటల్ నిర్మించారు.ఆనాడు బండలతో నిండి వున్న ఈ స్థలంలో బసవతారకం ఆస్పత్రి కట్టారు.ఇప్పటికి మంచి సేవలు అందుతున్నాయి..భారత మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారి వాజ్ పేయి గారు అప్పట్లోనే ఈ హాస్పిటల్ కోసం 6 కోట్లు మంజూరు చేసి హాస్పిటల్బ లోపేతానికి దోహదపడ్డారు..ఇటువంటి గొప్ప హాస్పిటల్ కి ఛైర్మన్ గా పని చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.ఆంధ్ర రాష్ట్రం ఎమ్మెల్యే గా హిందూపురం ప్రభుత్వ హాస్పిటల్ ని తీర్చి దిద్ది కార్పోరేట్ తరహా వైద్యం అందిస్తున్నాం..అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా త్వరలో బసవతారకం కాన్సర్ హాస్పిటల్ ప్రారంభించనున్నాం..ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో గతంలోనే చంద్రబాబు గారు స్థలం కేటాయించారు..అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు బాలయ్య తెలిపారు.

Show comments