NTV Telugu Site icon

Uttarpradesh : రూ.54 బొగ్గు చోరీ కేసులో 32 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు.. శిక్ష ఏంటంటే ?

New Project (8)

New Project (8)

Uttarpradesh : బొగ్గు చోరీ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని మొరాదాబాద్ రైల్వే కోర్టు 32 ఏళ్ల తర్వాత తీర్పు వెలువరించింది. 1992లో క్రికెట్ ఆడుతున్న సమయంలో 15 ఏళ్ల విద్యార్థిపై బొగ్గు దొంగతనం కేసు నమోదైంది. ఈ కేసు మొరాదాబాద్ రైల్వే కోర్టులో 32 ఏళ్లుగా కొనసాగింది. కేవలం రూ.54 విలువైన బొగ్గు చోరీకి పాల్పడిన విద్యార్థులకు వారెంట్లు జారీ చేశారు. ఇప్పుడు 32 ఏళ్ల తర్వాత ఒక రోజు శిక్ష తర్వాత, క్షమాపణ లేఖ రాయడం ద్వారా కేసు క్లోజ్ అయింది. విషయం 1992 సంవత్సరం. స్థానిక మెడికల్ స్టోర్‌లో పనిచేస్తున్న విపిన్ అలియాస్ ఇమ్మాన్యుయేల్ పాల్‌కు అప్పటికి 15 ఏళ్లు. మామ శాంసన్ పాల్ అతన్ని దత్తత తీసుకున్నాడు. ఓ రోజు తన స్నేహితుడు రాబిన్‌సన్‌తో కలిసి క్రికెట్ ఆడుతున్నప్పుడు బంతి రైల్వే గోదాం వైపు వెళ్లిందని విపిన్ చెప్పాడు. వీరిద్దరూ బంతిని సేకరించేందుకు వెళ్లగా.. వారిని బొగ్గు దొంగలంటూ ఆర్పీఎఫ్ ఉద్యోగులు ఆరోపించి అరెస్ట్ చేశారు. నివేదిక రాసి పిల్లలిద్దరినీ జైలుకు పంపారు. అయితే ఆ మరుసటి రోజే అతని మామయ్య బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చాడు.

Read Also:TS EAPCET 2024: అలర్ట్… తెలంగాణ ఎంసెట్, ఐసెట్ పరీక్షల షెడ్యూల్ మార్పు..!

విపిన్ ప్రకారం మొరాదాబాద్ ఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ విజేంద్ర సింగ్ మార్చి 16 ఉదయం వచ్చారు. అతనిపై 1992 నుంచి వారెంట్లు నడుస్తున్నాయని చెప్పారు. దాదాపు రూ.54 విలువైన బొగ్గును దొంగిలించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు విపిన్‌ను మొరాదాబాద్ జైల్లో పెట్టారు. దీని తర్వాత, మెడికల్ స్టోర్ ఆపరేటర్ దుర్గేష్ ఖట్వానీ మొరాదాబాద్‌లోని రైల్వే కేసులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ న్యాయవాది రాజేంద్ర టాండన్‌ను సంప్రదించారు. రైల్వే కోర్టుకు టాండన్ వాస్తవాన్ని చెప్పాడు. జైల్లోనే విపిన్ క్షమాపణలు రాసిచ్చేలా చేశారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు విపిన్‌కు జరిమానా విధించకూడదని నిర్ణయించింది. కేసు క్లోజ్ చేసింది.

Read Also:Death Penalty: 6 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడికి మరణశిక్ష విధింపు..

Show comments