NTV Telugu Site icon

Google Bard: ‘బార్డ్’ ఎంత పనిచేసింది..గూగుల్‌కు 100 బిలియన్ డాలర్లు మటాష్!

Fds

Fds

సెర్చ్‌ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్‌ తగిలింది. చిన్న పొరపాటు కారణంగా బిలియన్‌ డాలర్లు కోల్పోవాల్సి వచ్చింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన చాట్‌బోట్ చాట్‌జీపీటీకి పోటీగా బార్డ్‌ను రంగంలోకి దింపిన గూగుల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ప్రకటించిన చాట్‌బాట్‌ బార్డ్‌కు సంబంధించిన ఒక ప్రకటనలో భారీ తప్పిదం చోటు చేసుకుంది. ఈ కారణంగా గూగుల్ మాతృసంస్థ ఆల్పాబెట్ షేర్ ధర బుధవారం 8 శాతం కుప్పకూలింది. ఫలితంగా గూగుల్‌ ఒక్క రోజులోనే ఏకంగా 100 బిలియన్ డాలర్ల (దాదాపు 8లక్షల 26 వేల కోట్లు) మేర మార్కెట్ విలువను కోల్పోయింది.

Also Read: INDvsAUS 1st Test: ముగిసిన తొలిరోజు ఆట.. టీమిండియా 77/1

అసలేం జరిగింది..

సౌరవ్యవస్థ వెలుపలి గ్రహాల చిత్రాలను తొలిసారిగా ఏ శాటిలైట్ తీసిందన్న ప్రశ్నకు బార్డ్ సరైన సమాధానం ఇవ్వడంలో తప్పులో కాలేసింది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అని సమాధానం చెప్పింది. కానీ నాసా ధృవీకరించినట్లుగా, 2004లో యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన టెలిస్కోప్ ఈ చిత్రాలను తీసింది. బార్డ్‌కు సంబంధించి గూగుల్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన చిన్న GIF వీడియోలో ఈ పొరపాటు దొర్లింది. మరోవైపు మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీతో దూసుకు రావడంతో గూగుల్ బార్డ్ వైపు ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా ఉన్నారని, ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని, మార్కెట్‌ గూగుల్‌కు భారీ శిక్ష విదించిందని ట్రిపుల్ డి ట్రేడింగ్‌ మార్కెట్ నిర్మాణ విశ్లేషకుడు డెన్నిస్ డిక్ వ్యాఖ్యానించారు.

Also Read: Today (09-02-23) Business Headlines: ఇన్సూరెన్స్ కంపెనీలూ.. ఇది కరెక్ట్ కాదు. మరిన్ని వార్తలు

Show comments