ఎన్టీఆర్ జిల్లా మొత్తం సెక్షన్ IPC 144, పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు. పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించినట్లు తెలిపారు. బాణాసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది.. అపోహలకు పోయి ఎలాంటి గొడవలకు దారి తీయొద్దు.. అనుమానాలుంటే పోలీసు నంబర్లకు కాల్ చేయచ్చు అని ఆయన పేర్కొన్నారు. ఇక, స్ట్రాంగ్ రూంలకు రెండు కిలోమీటర్ల దూరం వరకూ రెడ్ జోన్, డ్రోన్లు ఎగురవేసినా, అతిక్రమించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాపింప చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ వెల్లడించారు.
Read Also: Meaning of Number Plate: రంగు రంగుల్లో నంబర్ ప్లేట్లు.. ఏ రంగు దేనికంటే..
కాగా, స్ట్రాంగ్ రూం లకు రెండు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు, సివిల్ పోలీసులు, ఏపీఎస్పీతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు. కౌంటింగ్ రోజు సెంటర్ కు వంద మీటర్ల దూరంలో పార్కింగ్ చేయాలి.. ఫేషియల్ రికగ్నిషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసామన్నారు. ఇక, కలెక్టర్ ఇచ్చిన పాసులు ఉన్న వారికే స్ట్రాంగ్ రూంలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పుకొచ్చారు. డైనమిక్ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసాం.. ఫైర్, సెక్యూరిటీకి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసాం.. అతి పెద్ద గొడవలు మన జిల్లాలో జరగలేదు.. మా అధికారులలో లోపాలున్నా ఉపేక్షించేది లేదు.. సోషల్ మీడియాపై విజిలెన్స్ కోసం ఒక టీం ను ఏర్పాటు చేసామని సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ పేర్కొన్నారు.