NTV Telugu Site icon

November 2024 Bank Holidays: నవంబర్‌లో 13 రోజుల పాటు బ్యాంకులు బంద్‌!

Bank Holidays

Bank Holidays

నవంబర్‌లో బ్యాంకులకు సెలవుల జాబితా వచ్చేసింది. వచ్చే నెలలో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే ఈ 13 రోజుల సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఉండవు. కొన్ని సెలవులు దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఉంటాయి. కొన్ని వేర్వేరు రాష్ట్రాల పండుగలు, ప్రత్యేక రోజుల సందర్భంగా ఆ రాష్ట్రాల్లో మాత్రమే మూతపడతాయి. రిజర్వ్ బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ సెలవుల గురించి పూర్తి సమాచారాన్ని అందించింది. ప్రతినెలా అన్ని ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు కేటాయించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా కొన్నిసార్లు రిజర్వ్ బ్యాంక్ కూడా ఎన్నికల కారణంగా లేదా మరేదైనా కారణాల వల్ల సెలవులు ప్రకటిస్తుంది.

READ MORE: Ghaziabad Court Fight: కోర్టులో రచ్చ.. లాయర్లపై పోలీసుల లాఠీఛార్జి (వీడియో)

నవంబర్‌లో చాలా పండుగలు..
నవంబర్‌లో చాలా పండుగలు వస్తున్నాయి. వీటిలో దీపావళి అమావాస్య (లక్ష్మీ పూజ), కుట్ ఫెస్టివల్, కన్నడ రాజ్యోత్సవ్, బలిపాడ్యమి, విక్రమ్ సంవత్ న్యూ ఇయర్ డే, ఛత్ (సాయంత్రం అర్ఘ్య), ఛత్ (ఉదయం అర్ఘ్య)/వంగ్లా ఫెస్టివల్, ఎగాస్-బగ్వాల్, గురునానక్ జయంతి/కార్తీక్ పూర్ణిమ/ రహాస్ ఉన్నాయి. పూర్ణిమ, కనకదాస్ జయంతి, సెంగ్ కుత్సానేం మొదలైనవి ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. ఈ కాలంలో బ్యాంకులు మూసివేయబడతాయి.

సెలవులు పూర్తి వివరాలు..
నవంబర్ 1 (శుక్రవారం): దీపావళి, కుత్ మహోత్సవ్, కన్నడ రాజ్యోత్సవాల సందర్భంగా త్రిపుర, కర్ణాటక, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, మేఘాలయ, సిక్కిం, మణిపూర్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి.

నవంబర్ 2 (శనివారం): గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో దీపావళి (బలి ప్రతిపాద) / బలిపాడ్యమి / లక్ష్మీ పూజ (దీపావళి) / గోవర్ధన్ పూజ / విక్రమ్ సంవత్ నూతన సంవత్సరం రోజున బ్యాంకులు మూసివేయబడతాయి.

నవంబర్ 3 (ఆదివారం): దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.

నవంబర్ 7 (గురువారం): బెంగాల్, బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఛత్ (సాయంత్రం అర్ఘ్య) సందర్భంగా బ్యాంకులకు సెలవులు..

నవంబర్ 8 (శుక్రవారం): బీహార్, జార్ఖండ్, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో ఛత్ (ఉదయం అర్ఘ్య)/వంగ్లా పండుగ సందర్భంగా సెలవు ప్రకటించారు.

నవంబర్ 9 (శనివారం): నెలలో రెండవ శనివారం. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.

నవంబర్ 10 (ఆదివారం): దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.

నవంబర్ 12 (గురువారం): ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, చండీగఢ్, ఉత్తరాఖండ్, హైదరాబాద్-తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్ము, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఎగాస్-బగ్వాల్ సందర్భంగా శ్రీనగర్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.

నవంబర్ 15 (శుక్రవారం):గురునానక్ జయంతి / కార్తీక పూర్ణిమ / రహస్ పూర్ణిమ సందర్భంగా.. మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, చండీగఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్ము, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లో బ్యాంకులు బంద్ చేస్తారు.

నవంబర్ 17 (ఆదివారం): దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.

నవంబర్ 18 (సోమవారం): కనకదాస్ జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు మూతపడనున్నాయి.

నవంబర్ 23 (శనివారం): సెంగ్ కుత్స్నెమ్ సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు. ఈ నెలలో రెండో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూతపడతాయి.

నవంబర్ 24 (ఆదివారం): దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.