Site icon NTV Telugu

Bangladesh: బంగ్లాదేశ్ రాజకీయాల్లో సరికొత్త శకం.. బీఎన్‌పీకి కొత్త చీఫ్

Tarique Rahman

Tarique Rahman

Bangladesh: బంగ్లాదేశ్‌కు చెందిన బీఎన్‌పీ పార్టీకి కొత్త ఛైర్మన్ వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది బంగ్లా రాజకీయాల్లో కొత్త శకానికి నాంది లాంటింది. బీఎన్‌పీ పార్టీ చీఫ్ ఖలీదా జియా దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీకి శుక్రవారం ఆవిడ కుమారుడు తారిక్ రెహమాన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. బంగ్లా మీడియా నివేదికల ప్రకారం.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పి) స్టాండింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా రెహమాన్ నియామకాన్ని ఆమోదించింది.

READ ALSO: Samyukta: నారి నారి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కథ కాదు

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పి) ప్రధాన కార్యదర్శి మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ సమావేశం అనంతరం మీడియాకు ఆయన నియామకాన్ని ధృవీకరించారని ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. లండన్‌లో 17 ఏళ్ల ప్రవాసం తర్వాత రెహమాన్ డిసెంబర్ 25న బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చారు. ఈక్రమంలో పార్టీ అధ్యక్షురాలు, ఆయన తల్లి ఖలీదా జియా మరణం తర్వాత ఆ పదవి ఖాళీ కావడంతో బీఎన్‌పీ ఛైర్మన్‌గా తాజాగా ఆయన నియమితులయ్యారు. మూడుసార్లు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి, బీఎన్‌పీ చీఫ్ ఖలీదా జియా డిసెంబర్ 30న దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించారు. పార్టీ రూల్స్ ప్రకారం.. ఆమె మరణంతో ఖాళీగా ఉన్న ఛైర్మన్ పదవిని భర్తీ చేయడానికి జాతీయ స్టాండింగ్ కమిటీ సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో నూతన ఛైర్మన్‌గా రెహమాన్ ఎన్నికయ్యారు. రెహమాన్ రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే.. గతంలో ఆయన 2002లో BNP సీనియర్ జాయింట్ సెక్రటరీ జనరల్‌గా, 2009లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. బంగ్లాలో ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలలో మాజీ ప్రధాన మంత్రి హసీనా అవామీ లీగ్ పార్టీ పోటీ చేయకుండా నిషేధం ఉన్న కారణంగా, దేశంలో అధికారాన్ని కైవసం చేసుకోడానికి BNP బలమైన పోటీదారుగా ఆవిర్భవించింది. నిజానికి బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఖలీదా జియా, హసీనాల శకం ముగిసినట్లే అని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Anil Ravipudi: ట్రోలింగ్‌పై డైరెక్టర్ అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్..

Exit mobile version