Bangladesh Violence: బంగ్లాదేశ్ (Bangladesh) మరోసారి రాజకీయ హింస (Political Violence), అగ్నిప్రమాదాలతో అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కు చెందిన నిషేధిత పార్టీ అవామీ లీగ్ (Awami League) పిలుపునిచ్చిన ‘లాక్డౌన్’ (Lockdown)కు ముందే దేశవ్యాప్తంగా భారీ ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా రాజధాని ఢాకా (Dhaka)లో పలుచోట్ల నాటు బాంబులు (Crude Bombs) పేలడంతో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. గత రెండు రోజులుగా బంగ్లాదేశ్‌లోని సిల్హెట్, రాజ్షాహి, బారిసాల్, ఫరీద్పూర్ ప్రాంతాల్లో మహ్మద్ యూనస్ (Muhammad Yunus)కు చెందిన ‘గ్రామీణ బ్యాంక్’ (Grameen Bank) శాఖలపై దాడులు జరిగాయి. పలు బ్రాంచీలకు దుండగులు నిప్పు పెట్టారు. అంతేకాకుండా, చిట్టగాంగ్ (Chittagong)లోని పాంచ్లైస్ ప్రాంతంలో ఉన్న తాత్కాలిక ప్రభుత్వ మాజీ అధినేత మహ్మద్ యూనస్ పూర్వీకుల ఇంటిని కూడా గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. మరోవైపు, ప్రధాని తారిక్ రెహమాన్ (Tarique Rahman) నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) కార్యకర్తలు ఢాకాలోని ఇద్దరు అవామీ లీగ్ నేతల ఇళ్లపై రాత్రికి రాత్రే దాడి చేసి నిప్పంటించినట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.
దేశంలో మొత్తం 64 జిల్లాలు ఉండగా.. ప్రస్తుతం దాదాపు 28 జిల్లాల్లో డజన్ల కొద్దీ బాంబు పేలుళ్లు సంభవించాయి. పదుల సంఖ్యలో వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ అల్లర్లలో ఢాకాలో కనీసం నలుగురికి గాయాలయ్యాయి. పశ్చిమ నరైల్ (Narail) జిల్లాలో బీఎన్పీ చేపట్టిన ర్యాలీపై అవామీ లీగ్ కార్యకర్తలు దాడి చేయడంతో అధికార పార్టీకి చెందిన ఇద్దరు స్థానిక నేతలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఫరీద్పూర్, పిరోజ్‌పూర్ ప్రాంతాల్లో ఒక బీఎన్పీ నేతతో పాటు ఒక ట్రాన్స్పోర్ట్ ఉద్యోగి మృతి చెందారు.
అసలు ఈ గొడవ ఎందుకు మొదలైంది?
ఈ గొడవ అంతా షేక్ హసీనా (Sheikh Hasina) మళ్లీ దేశానికి తిరిగి వస్తున్నానని ప్రకటించడంతోనే మొదలైంది. 2024 ఆగస్టు 5న జరిగిన విద్యార్థుల ఉద్యమం (July Uprising) తర్వాత పదవి కోల్పోయిన హసీనా ప్రస్తుతం భారత్ (India)లో ఆశ్రయం పొందుతున్నారు. గతేడాది ఒక ప్రత్యేక ట్రిబ్యూనల్ (Special Tribunal) మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న కేసులో హసీనాకు మరణశిక్ష (Death Sentence) విధించింది. ఆ తీర్పు వెలువడి ఏడాది పూర్తయిన సందర్భంగా అవామీ లీగ్ ఈ లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చింది. అయితే, మరణశిక్ష ఉన్నప్పటికీ డిసెంబర్లో ఏదేమైనా బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని హసీనా ఈ నెల ప్రారంభంలో ప్రకటించారు. అప్పటి నుంచే అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం ఆమె స్వస్థలం తుంగిపారా (Tungipara)లో దాదాపు 30 మంది మద్దతుదారులను అరెస్ట్ చేయడంతో వందలాది మంది పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో పోలీసులు స్టేషన్ ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిణామాలపై ప్రధాని తారిక్ రెహమాన్ తీవ్రంగా స్పందించారు. అవామీ లీగ్‌ను ఒక ‘ఉగ్రవాద సంస్థ’ (Terrorist Organization)గా, ‘ఓడిపోయిన ఫాసిస్ట్ శక్తి’గా అభివర్ణించారు. ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. 2024 నాటి స్ఫూర్తితో నియంతృత్వ శక్తులను మరోసారి తరిమికొట్టాలని ఆయన పార్లమెంట్ (Parliament) వేదికగా కోరారు. కేవలం ప్రభుత్వ యంత్రాంగంపైనే ఆధారపడకుండా, ఎంపీలందరూ రోడ్లపైకి వచ్చి పరిస్థితిని ఎదుర్కోవాలని ఆయన సూచించినట్లు ‘ది డైలీ స్టార్’ (The Daily Star) పత్రిక పేర్కొంది.
ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు (Security Arrangements) చేసింది. హసీనా జన్మస్థలమైన గోపాల్‌గంజ్ (Gopalganj) సహా సున్నితమైన జిల్లాల్లో వేలాది మంది ‘బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్’ (Border Guard Bangladesh – BGB) పారామిలిటరీ బలగాలను మోహరించారు. గడిచిన 24 గంటల్లో ఒక్క ఢాకాలోనే పోలీసులు 565 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో హసీనా కేబినెట్లో మాజీ విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన నూరుల్ ఇస్లాం నహిద్ (Nurul Islam Nahid) కూడా ఉన్నారు. ఆడియో, వీడియో ఆధారాల ప్రకారం అల్లరిమూకలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సలాహుద్దీన్ అహ్మద్ (Salahuddin Ahmed) హామీ ఇచ్చారు. 2024లో హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత యూనస్ హయాంలో అవామీ లీగ్‌పై నిషేధం విధించడంతో పాటు, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ (Sheikh Mujibur Rahman) నివాసాన్ని, 1971 విముక్తి పోరాట స్మారక చిహ్నాలను ధ్వంసం చేశారు. ఇప్పుడు అదే హింస మరో కొత్త రూపంలో దేశాన్ని కుదిపేస్తోంది.

