Ban vs Pak: బంగ్లాదేశ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన పాకిస్థాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Defeat Pakistan: బంగ్లాదేశ్ స్వదేశంలో పాకిస్తాన్ పై చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు 163 పరుగులకే కుప్పకూలింది. దీంతో సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇదే సమయంలో స్వదేశంలో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇది తొలి టెస్టు విజయం కావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో యువ పేసర్ నాహిద్ రానా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి పాకిస్థాన్ పతనానికి ప్రధాన కారణమయ్యాడు. ముఖ్యంగా టీ తర్వాత అతడు వేసిన మూడు ఓవర్ల స్పెల్ మ్యాచ్‌ను పూర్తిగా మలుపుతిప్పింది. 119/3తో డ్రా దిశగా సాగుతున్న పాకిస్థాన్‌ను నహీద్ వరుస వికెట్లతో కుదేలు చేశాడు. కేవలం 18 బంతుల వ్యవధిలో సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, నోమన్ అలీ వికెట్లు తీసి పాకిస్థాన్ ఆశలను గల్లంతు చేశాడు.
Also Read
- డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
- PM Modi’s Saptdhara Vision: వికసిత్ భారత్ కోసం ‘సప్తధార’.. మోడీ చెప్పిన 7 కీలక శక్తులివే..
- కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
- Red Fort: ఎర్రకోట ఎందుకు అంత ముఖ్యమైంది? మొఘలుల నుంచి బ్రిటిష్ వరకు.. చరిత్రలోని ఆసక్తికర నిజాలు
ఈ పరాజయంతో పాకిస్థాన్ చెత్త రికార్డును కూడా నమోదు చేసింది. బంగ్లాదేశ్ చేత వరుసగా మూడు టెస్టుల్లో ఓడిన రెండో జట్టుగా నిలిచింది. అంతకుముందు ఈ ఘోరం కేవలం జింబాబ్వేకు మాత్రమే ఎదురైంది. మరోవైపు పాకిస్థాన్ తరఫున అరంగేట్ర ఆటగాళ్లు అజాన్ అవైస్, అబ్దుల్లా ఫజల్ కొంత పోరాటం చూపించారు. ఇద్దరూ కలిసి 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే మెహిడీ హాసన్ మిరాజ్ బౌలింగ్‌లో అజాన్ అవుట్ కావడంతో పాకిస్థాన్ మళ్లీ ఒత్తిడిలో పడింది. అబ్దుల్లా ఫజల్ 66 పరుగులతో రాణించినా జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో బంగ్లాదేశ్ జట్టు స్వదేశంలో చారిత్రక టెస్టు విజయాన్ని సంబరంగా జరుపుకుంది.
తాజావార్తలు
-
Amrit Bharat Express: 7 కొత్త అమృత్ భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు కీలక కనెక్టివిటీ
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
PM Modi’s Saptdhara Vision: వికసిత్ భారత్ కోసం ‘సప్తధార’.. మోడీ చెప్పిన 7 కీలక శక్తులివే..
-
Venky Atluri: త్రివిక్రమ్ ఛాయలు.. వెంకీ అట్లూరి రైటింగ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..