Site icon NTV Telugu

Shocking School Fees: బాబోయ్ స్కూల్ ఫీజులు.. అక్షరాల లక్షలు

Shocking School Fees

Shocking School Fees

Shocking School Fees: ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూల్‌కు పిల్లలను పంపే తల్లిదండ్రులు వారి బ్యాగులను మోయడానికే అనేక అవస్థలు పడేవారు. కానీ ఇప్పటి నుంచి ఆ బ్యాగుల కన్నా.. స్కూల్ ఫీజులే ఎక్కువ బరువు కానున్నాయి. నిజం అండీ బాబు.. ఇటీవల బెంగళూరులోని స్కూల్ ఫీజులు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌గా మారాయి. ఎందుకంటే అక్కడి స్కూల్స్‌లో ఫీజుల వివరాలు చాలా మంది తల్లిదండ్రులను వాస్తవంగా షాక్‌కు గురి చేశాయి. నగరంలోని ఒక అంతర్జాతీయ పాఠశాల గురించి సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌లో తల్లిదండ్రులు తమ పిల్లలను గ్రేడ్ 1లో చేర్చుడానికి ఏడాదికి రూ.7.35 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని కనిపించింది. దెబ్బకు ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ పోస్ట్‌ను హార్దిక్ పాండ్యా అనే యూజర్ X లో షేర్ చేశారు. ఆయన తన ఎక్స్ అకౌంట్లో IB-అనుబంధ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి స్కూల్ ఫీజుల ఫోటోను అప్‌లోడ్ చేశాడు. ఈ ఫోటోలో స్కూల్‌లో గ్రేడ్ 1–5 కింద పిల్లలను చేర్పిస్తే.. తల్లిదండ్రులు ఏడాదికి రెండుసార్లు రూ.3,67,500 చెల్లించాల్సి ఉంటుందని, మొత్తంగా సంవత్సరానికి రూ.7.35 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఉంది.

READ ALSO: Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ వచ్చేసింది.. చూశారా!

ఇక్కడితో అయిపోలేదు.. ఇంకా ఉంది..
రూ.7.35 లక్షలతో పాటు స్కూల్‌లో అడ్మిషన్ తీసుకునే సమయంలో రూ.లక్ష కట్టాల్సిందే. ఇక్కడ విశేషం ఏమిటంటే దీనిని తిరిగి రిటన్ చేయారు. అడ్మిషన్ ఫీజుతో పాటు రూ.1,000 దరఖాస్తు ఫీజును కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ స్కూల్స్‌లో సీనియర్ క్లాస్ విద్యార్థుల ఫీజులు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. 11 – 12 తరగతుల విద్యార్థులకు, వార్షిక ఖర్చు దాదాపు రూ. 11 లక్షల వరకు ఉంటుంది. ఈ ఫీజుల రికార్డుతో స్కూల్ దేశంలోని అత్యంత ఖరీదైన ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటిగా నిలిచింది. ఈ పోస్ట్‌ను పాండ్యా ఎక్స్‌లో పోస్ట్ చేసి ఇలా రాశారు.. “బెంగళూరులోని మెరుగైన విద్యాసంస్థల్లో ఒకదానిలో ప్రాథమిక పాఠశాల గ్రేడ్ 1 వార్షిక ఫీజు సంవత్సరానికి ₹7. 35 లక్షలుగా ఉంది. ఇందులో తిరిగి చెల్లించని రూ.1లక్ష అడ్మిషన్ ఫీజును మిస్ అవ్వకండి.” అని పేర్కొన్నారు. పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే ఈ పోస్ట్ వందలాది మందిని ఆకర్షించింది. దీనిపై చాలా మంది నెటిజన్లు స్పందించారు. భారతదేశంలో నాణ్యమైన విద్య నెమ్మదిగా ధనవంతులైన కుటుంబాలకు కూడా భరించలేనిదిగా మారుతుందా అని కొందరు ఈ పోస్ట్ కింద ప్రశ్నించారు.

ఇది విద్య కాదని, ఇది స్కూల్ యూనిఫాంలో దోపిడీని కొందరు కామెంట్స్ చేశారు. 1వ తరగతికి ఏడాదికి ఏడున్నర లక్షలు, దానితో పాటు రూ.లక్ష ప్రవేశ రుసుము ఏంటిదని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం మంచి ఖరీదైన పాఠశాలను ఎంచుకుంటున్నామని అనుకుంటున్నారు, కానీ వారు వాస్తవానికి వారి పిల్లలను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నారని అభిప్రాయలు వ్యక్తం చేశారు. ప్రపంచంలోని చాలా ప్రాంతాలు విద్య ఉచితం, కానీ మనదేశంలో మాత్రం వ్యాపారం అని పోస్ట్‌కు రిప్లైలు ఇచ్చారు.

READ ALSO: Sexual Harassment: యూపీలో ఘోరం.. స్టూడెంట్‌‌పై స్కూల్ ప్రిన్సిపాల్ లైంగిక దాడి..

Exit mobile version