Rave Party : బెంగళూరులో రేవ్‌పార్టీ.. పట్టుబడిన పలువురు సినీ ప్రముఖులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rave Party : ఇటీవల కాలంలో వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు ఎంజాయ్ చేయడానికి ఎగబడుతున్నారు యూత్. పబ్, రీసార్ట్స్ లో పార్టీలు చేసుకుంటూ ఫుల్ కొట్టి చిల్ అవుతున్నారు. కొంతమంది సీక్రెట్ ప్లేసుల్లో రెయిన్ పార్టీలు, రేవ్ పార్టీ చేసుకుంటూ పీకల్లోతు మత్తులో మునిగితేలుతున్నారు. రేవ్ పార్టీలు జరుగుతున్న సమాచారం తెలుసుకుని పోలీసులు దాడులు చేయడంతో అడ్డంగా బుక్కవుతున్నారు. ఇలాంటి పార్టీల్లో సామాన్యులే కాదు.. కొన్నిసార్లు సెలబ్రెటీలు కూడా దొరికిపోతున్నారు. రేవ్ పార్టీ పేరుతో డ్రగ్స్, మద్యం తీసుకుంటూ రెచ్చిపోతున్నారు.
Read Also: Jabardasth Faima: బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన ఫైమా..ఈసారైనా?
Also Read
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
బర్త్ డే పార్టీ పేరుతో సిలికాన్ సిటీ బెంగళూరు సమీపంలో ఆదివారం రాత్రి రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. రేవ్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. ఈ పార్టీలో మందుతోపాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ ను కూడా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు, మోడళ్లు, బడాబాబులు పట్టుబడ్డారు. ఆంధ్రా, బెంగళూరుకు చెందిన దాదాపు 100 మందికిపైగా పార్టీకి హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also:Directors Day: “డైరెక్టర్స్ డే” ఈవెంట్.. సందడి చేసిన స్టార్ హీరోలు!
ఈ క్రమంలో టాలీవుడ్‌కి చెందిన కొందరిని పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. కన్నడ మీడియాలో నటి హేమ పేరు మార్మోగిపోతుంది. దీనిపై వెంటనే సినీ నటి హేమ స్పందించారు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. నాకు బెంగుళూరు రేవ్ పార్టీ తో సంబంధం లేదని వెల్లడించారు. అనవసరంగా నన్ను లాగుతున్నారు. కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని వివరించారు.
- Tags
- bangalore
- Hema
- Rave Party
తాజావార్తలు
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!