Site icon NTV Telugu

Bangalore : భర్త తనను సుఖపెట్టడం లేదని రూ. 2 కోట్ల పరిహారం డిమాండ్ చేసిన భార్య..

Ben

Ben

Bangalore Marriage Dispute: కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఒక వింతైన వైవాహిక వివాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసులో కొత్తగా పెళ్లైన జంటకు సంబంధించినది. ఫస్ట్ నైట్ రోజు తనతో శారీరక సంబంధం పెట్టుకోలేదని భార్య భర్త నుంచి 2 కోట్ల రూపాయల పరిహారం డిమాండ్ చేసింది. వివాహం జరిగి కొన్ని వారాలు గడిచినా.. తన భర్త తనతో లైంగిక సంబంధం పెట్టుకోలేదని భార్య ఆరోపించింది. భర్త తనపై దాడి చేసి ఆస్తిని లాక్కోవడానికి యత్నించాడని చెబుతోంది. అసలు ఏం జరిగింటే.. బెంగళూరులోని గోవిందరాజ్ నగర్ నివాసి చందనను, చిక్కమగళూరులోని తరికెరెకు చెందిన ప్రవీణ్ కె.ఎం మే 5, 2025న వివాహం చేసుకున్నారు. హిందూ ఆచారాల ప్రకారం ప్రవీణ్ గ్రామంలో వివాహం ఘనంగా జరిగింది. బెంగళూరులోని సప్తగిరి ప్యాలెస్‌లో రిసెప్షన్ నిర్వహించారు. ప్రవీణ్ కుటుంబం వీటి ఖర్చంతా భరించింది. రిసెప్షన్ తర్వాత, చందన గృహప్రవేశ వేడుక కోసం బెంగళూరుకు తిరిగి వచ్చి దాదాపు ఏడు రోజులు అక్కడే బస చేసింది.

READ MORE: మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం మాస్టర్ ప్లాన్ విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

మే 16న ఇద్దరికి ప్రవీణ్ ఇంట్లో ఫస్ట్‌ నైట్ జరిగింది. కానీ మానసిక, శారీరక ఒత్తిడి కారణంగా ఆ జంట లైంగికంగా కలవలేదు. రెండ్రోలు ఇలాగే సాగింది. దీంతో చందన తన భర్తతో గొడవ పడటం ప్రారంభించింది. అతన్ని తిడుతూ, దుర్భాషలాడింది. నపుంసకుడు(గే) అని అవమానించింది. మే 19న, చందన ప్రవీణ్‌ను తన మామ జైరామ్ ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ ఈ విషయాన్ని చెబుతూ.. తన భర్తను ఘోరంగా అవమానించింది. మే 21న, చందన కుటుంబం, బంధువులు ప్రవీణ్ ఇంటికి చేరుకుని, గొడవ సృష్టించారు. మే 24న, ప్రవీణ్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రవీణ్ శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాడని, సెక్స్ చేసే సామర్థ్యం ఉన్నాడని, కానీ మానసిక ఒత్తిడి కారణంగా సమయం పడుతుందని అపోలో ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. అయినప్పటికీ.. ప్రవీణ్ భార్య అసంతృప్తిగా ఉంది. జూన్ 19న, చందన తన వస్తువులను తీసుకొని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. చందన తన కుటుంబం, బంధువులతో కలిసి ఆగస్టు 17న ప్రవీణ్ తన ఇంటిపై దాడికి వచ్చింది. ఆయుధాలు తీసుకెళ్లి ప్రవీణ్ పై దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి.

READ MORE:

మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం మాస్టర్ ప్లాన్ విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

దాడిలో అతని తలకు తీవ్ర గాయమైంది. ఇంటి గేటు, వస్తువులు ధ్వంసమయ్యాయి. అనంతరం దాడికి చేసిన చందన కుటుంబీకులు ప్రవీణ్ ఇంటి ముందు ధర్నా చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, వైద్య నివేదికలు అందుబాటులో ఉన్నాయి. తన భార్య, ఆమె తల్లిదండ్రులు తనను మానసికంగా హింసించారని, అవమానించారని, చంపడానికి ప్రయత్నించారని ప్రవీణ్ వాపోయాడు. అలాగే రూ.2 కోట్ల విలువైన ఆస్తిని బలవంతంగా లాక్కోవడానికి కుట్ర పన్నారని ఆరోపించాడు. ఈ అంశంపై గోవింద్రాజ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రవీణ్ ఫిర్యాదు ఆధారంగా తన భార్య చందన, కుటుంబీకులైన అశోక్ కుమార్ టిఆర్, మంజుల, జయరామ్ ఎం, మంజునాథ్ టిఆర్, కోమల్ ఎం, స్నేహ, శోభ, పునీత్, వెంకటేష్, ఇతరులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ.. ఇది ఇంతకీ మానసిక ఒత్తిడికి సంబంధించిన కేసా? లేక 2 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని దోచుకోవడానికి ప్లాన్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

Exit mobile version