Site icon NTV Telugu

Bandlaguda Ganesh: గణపతి లడ్డూ రూ. కోటి 20 లక్షలు.. ఎక్కడంటే..

Bandlaguda Laddu

Bandlaguda Laddu

Bandlaguda Ganesh: హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. మరోవైపు గణనాథుడి లడ్డూల వేలం ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది. గణపతి ప్రసాదాన్ని పొందేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. ఇందుకోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని బండ్లగూడలోని రిచ్‌మండ్ విల్లాలో గణపతి లడ్డూ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. గణపతి లడ్డూ రూ. కోటి 20 లక్షలు పలికి అందరిని ఆశ్చర్యానికి గురిచేసంది. గతంలో ఎన్నడూలేని విధంగా ధర పలకడం ఇక్కడ ఇదే మొదటి సారి.

Read also: Immersion of Ganesh idol : వినాయకుని విగ్రహాలు ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా..?

అయితే.. గతంలో కూడా ఇక్కడ గణపతి లడ్డూ రికార్డు స్థాయిలో ధర పలికిన సంగతి తెలిసిందే. గతేడాది ఇక్కడ గణపతి లడ్డూ రూ. 60.80 లక్షలు. అయితే ఈసారి ధర రెండింతలు పెరిగింది. 2021లో కూడా ఇక్కడ గణపతి లడ్డూ రూ. 41 లక్షలు కాగా, మాదాపూర్‌లోని మైహోం సైదర్‌లోనూ గణపతి లడ్డూకు భారీ ధర పలికింది. మైహోం సర్దార్‌లో గణేష్ లడ్డూ రూ. 25.50 లక్షలు. చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి వేలంలో గణపతి ప్రసాద్‌ను దక్కించుకున్నాడు. గతేడాదితో పోలిస్తే ఈసారి రూ. 7 లక్షలు అధిక ధర పలికింది. 2022లో రూ. ఇక్కడ జరిగిన గణపతి లడ్డూ వేలంలో రూ.18.50 లక్షలు అమ్ముడుపోయాయి.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు రూ. 10 వేలు ఫైన్.. అలా చేశారు అందుకే వేశారు..!

Exit mobile version