Site icon NTV Telugu

Bandla Ganesh: ఆయనే కనుక లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని

Bandla

Bandla

Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు వివాదాలు కొత్తేమి కాదు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం గణేష్ కు బాగా అలవాటు. ఒక పక్క రాజకీయాలకు తనకు సంబంధం లేదు అంటూనే రాజకీయపరంగా ట్వీట్స్ వేసి వివాదాలను రగిలిస్తాడు. మొన్నటికి మొన్న ఒక ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలు చెత్త అని హాట్ కామెంట్స్ చేసి షాక్ ఇచ్చిన బండ్ల తాజగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి నా అన్న అని చెప్పి మరో షాక్ ఇచ్చాడు. తాజాగా రంజిత్ రెడ్డిని కలిసిన బండ్ల గణేష్.. ఆయనే తన జీవితాన్ని కాపాడంటూ చెప్పుకొచ్చాడు.

” రంజిత్ అన్న లేకపోతే నేను లేను.రంజిత్ అన్న లేకపోతే నేను ఎప్పుడో ఆత్మహత్య చేసుకొనేవాడిని. ఆయన నా అన్న, నా దేవుడు .. ఆయనకోసం రాజకీయాలు అన్ని వదిలిపెట్టి ఆయన వెనుక నిలబడ్డా నేను .. అది గుర్తుపెట్టుకోండి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మొన్నటివరకు పవన్ కళ్యాణ్ నా దేవుడు అన్నావ్ .. నిన్నటికి నిన్న ఎన్టీఆర్ నా దేవుడు అన్నావ్.. ఇప్పుడేమో రంజిత్ రెడ్డి నా దేవుడు అంటున్నావ్.. ఎంతమంది దేవుళ్ళు ఉంటారు నీ గుండెల్లో అని కొందరు.. ఏంటి బండ్లన్నా పార్టీ మారుస్తున్నావా..? అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version