Site icon NTV Telugu

Bandi Saroj Kumar: కేసులేస్తే వాళ్లు ఇంకా పెద్దోళ్లవుతారు.. సినిమా ఇండస్ట్రీపై బండి సరోజ్ సంచలన ట్వీట్!

Bandi Saroj Kumar

Bandi Saroj Kumar

Bandi Saroj Kumar: తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు జరుగుతున్న ‘రివ్యూ మాఫియా’ చర్చలు, డిఫామేషన్ కేసులు, టికెట్ రేట్ల పెంపు అంశాలపై నటుడు, దర్శకుడు, రచయిత బండి సరోజ్ కుమార్ ఓ వైరల్ ట్వీట్‌తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. “రివ్యూయర్లపై డిఫామేషన్ కేసులు వేస్తే.. వాళ్ల ప్లాట్‌ఫాం మరింత పెద్దదవుతుంది. ఆర్టికల్ 19 ఇచ్చిన స్వేచ్ఛతో వాళ్లు మాట్లాడుతున్నారు. కోర్టు ఆదేశాలతో రేటింగ్స్ బ్లాక్ చేసినా.. ప్రజలు ఇప్పటికే నిజాయితీగా మాట్లాడే పాడ్‌కాస్ట్‌లు, ఛానెళ్ల వైపు వెళ్తున్నారు” అంటూ ఈ ట్వీట్‌లో బండి సరోజ్ స్పష్టంగా చెప్పారు.

READ ALSO: Revenge killing: పదేళ్ల క్రితం లేచిపోగా.. తల్లి మాజీ ప్రియుడిని హత్య చేసిన కొడుకు..

ఇటీవల చిరంజీవి సినిమా నుంచి మొదలైన ‘రేటింగ్స్ బ్లాక్’ ఆదేశాలు, ‘రివ్యూ మాఫియా’పై చర్యలు.. ఇవన్నీ జనవరి 2026లోనే జరిగాయి. అయితే ఈ చర్యలు రివ్యూయర్ల గొంతును అణచివేయడమే కాకుండా.. వాళ్లకు ఇంకా ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నాయని బండి సరోజ్ అభిప్రాయపడ్డారు. పెయిడ్ రివ్యూలు, ఫేక్ యూట్యూబ్ ఛానెళ్లను ప్రజలు తిరస్కరిస్తున్నారని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. “పెయిడ్ జర్నలిస్ట్ రివ్యూలు, ఫేక్ యూట్యూబ్ రివ్యూలను పట్టించుకోకండి. ప్రజలు ఇప్పుడు లక్షల వ్యూస్ వచ్చే జెన్యూన్ పాడ్‌కాస్ట్‌లు, డిస్కషన్లను ఇష్టపడుతున్నారు” అని స్పష్టం చేశారు. సినిమా ప్రేక్షకులు ఇప్పుడు నిజాయితీపై ఎక్కువ ఆధారపడుతున్నారని, మానిప్యులేటెడ్ కామెంటరీలపై నమ్మకం తగ్గిపోతోందని చెప్పారు. టికెట్ రేట్లే అసలు సమస్య.. కేసులు కాదని చెప్పారు. “రివ్యూయర్లపై కేసులు వేయడం కంటే.. టికెట్ రేట్లను రెగ్యులేట్ చేయండి. టికెట్ ధరలు పెరిగితే ఫుట్‌ఫాల్స్ తగ్గుతాయి. దీంతో హీరోల రెమ్యూనరేషన్, బాక్సాఫీస్ కలెక్షన్స్ రెండూ దెబ్బతింటాయి” అని హెచ్చరించారు. ప్రభుత్వ జీవోల ద్వారా టికెట్ రేట్లు ఎక్కువ చేయడం వల్ల సినిమా థియేటర్లకు ప్రేక్షకులు దూరమవుతున్నారని, దీర్ఘకాలంలో ఇది సినిమా రంగానికే నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. “టికెట్ ధరలు అందుబాటులో ఉంటేనే.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అప్పుడే అందరి జీతాలూ, సినిమా కలెక్షన్స్ బాగుంటాయి” అని ఆయన చెప్పారు.

READ ALSO: Eesha Rebba: పోలీసు స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ ఈషారెబ్బ.. ఆ వ్యక్తి వేధింపులే కారణమా?

Exit mobile version