బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 20 నుంచి వారం రోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా సిద్ధమైంది. ప్రజా సంగ్రామ యాత్ర ఇటీవలే పూర్తి చేసుకున్న సంజయ్, ఇప్పటికే ఒకసారి హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఆయన పార్టీ సీనియర్ నేతలతో చర్చించి ప్రచార వ్యూహం రూపొందించారనీ… అందుకు అనుగుణంగా నేతలు ఈటలకు మద్దతుగా ప్రచారం మరింత ఉధృతం చేయనున్నారని పార్టీ వర్గాలు వివరించాయి. పలువురు సీనియర్ నాయకులు ఇప్పటికే ప్రచారంలో నిమగ్నమయ్యారు
ఈనెల 20 నుంచి హుజురాబాద్ లో బండి సంజయ్ ప్రచారం
