Site icon NTV Telugu

Banana Price Hike : నిన్న టమోటా.. ఇప్పుడు అరటి.. కేజీ ఎంతంటే?

Bananas

Bananas

టమోటాలు ధరలు రోజూ రోజుకు పెరుగుతూ డబుల్ సెంచరీ చేశాయి.. సామాన్యుల జేబులకు చిల్లు పడేలా ఉన్నాయి.. ఒక్క టమోటా మాత్రమే కాదు అన్ని కూరగాయలు ధరలు భగ్గుమాన్నాయి.. టమోటా పండించే కీలక ప్రాంతాల్లో వడగాలులు, భారీ వర్షాలు, సరఫరా గొలుసులకు అంతరాయం కలగడమే కూరగాయలు విపరీతంగా పెరగడానికి కారణమని నిపుణులు, మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.. టమోటాలు మాత్రమే కాదు, కాలీఫ్లవర్, మిరప, అల్లం వంటి ఇతర కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చాలా ప్రాంతాల్లో దిగుబడి చేతికి అంది .. మార్కెట్లకు తరలివస్తోంది. దీంతో టమోటా ధరలు తగ్గుముఖం పట్టడం ప్రారంభంచాయి..

ఇకపోతే టమోటా ధరలు తగ్గాయని అనుకొనేలోపు ఇప్పుడు అరటి పండు షాక్ ఇవ్వడం ప్రారంభమైంది. బెంగళూరులో కేజీ అరటి పండ్ల ధర రూ.100కు చేరుకుంది. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. డిమాండ్‌కు తగిన స్థాయిలో సరఫరా లేని నేపథ్యంలోనే అరటి పండ్ల ధరలు పెరిగాయని విశ్లేషకులు అంటున్నారు.. ఢిల్లీ తో పాటు తమిళనాడులో కూడా అరటిపండు ధరలు భారీగా పెరిగాయి.. ఎలక్కిబలే, పచ్‌బలే రకాలను కన్నడిగులు ఇష్టంగా తింటారు. హోసూరు, కృష్ణగిరి నుంచి ఈ రకం పండ్లు సరఫరా అవుతాయి.. వాటికే మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉంది..

ఈ రెండు రకాల అరటి పండ్ల సరఫరా పడిపోయింది. ఓ మాసం క్రితం బిన్నీపేట్ మార్కెట్‌కు 1500 క్వింటాళ్ల ఎలక్కిబలే రకం పండ్లు వచ్చాయి. కానీ ఇఫ్పుడు అది 1000 క్వింటాళ్లకు పడిపోయిందని వర్తకులు చెబుతున్నారు. బెంగళూరు నుంచి నగర సరిహద్దు జిల్లాలైన తమకూరు, రామనగర, చిక్‌బళ్లాపూర్, అనేకల్, బెంగళూరు రూరల్ ప్రాంతాలకు ఈ అరటి పండ్లు చేరుకుంటాయి.. ప్రస్తుతం వర్షాల కారణంగా దిగుబడి కూడా తగ్గుతుందని వ్యాపారులు చెబుతున్నారు… బహిరంగ మార్కెట్‌లో కేజీ అరటి పండ్ల ధర రూ.100కు చేరుకుంది. అయితే రానున్న రోజుల్లో ఓనం, వినాయక చవితి, విజయ దశమి పర్వదినాలు ఉండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు..

Exit mobile version