సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. కొన్ని వీడియోలు ఫోటోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని మాత్రం జనాలకు చిరాకు తెప్పిస్తున్నాయి..ఇక ఫుడ్ వీడియోల గురించి అయితే చెప్పనక్కర్లేదు.. వింత వింత వంటలను పరిచయం చేస్తున్నారు.. వెరైటీ ఏమో గానీ వాంతులు అవుతున్నాయి.. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. అదేంటో కాదు.. పానీపూరి.. స్పైసీ, పుల్లగా ఉంటుంది కాబట్టే లొట్టలు వేసుకుంటూ తింటున్నారు.. ఇక తియ్యగా ఉంటే.. వినడానికే వాంతి వస్తుంది కదూ.. ఇక ఎలా చేశారో మొత్తం చూస్తే జన్మలో ఇక పానీపూరి జోలికి వెళ్లరు..
గుజరాత్ కు చెందిన ఓ వీధి వ్యాపారి కొత్తగా బనానా పానీ పూరి ట్రై చేశాడు. అలాగే తన వద్దకు వచ్చే వారికి దానిని రుచి కూడా చూపిస్తున్నాడు. ఆ బనానా పానీ పూరికి చెందిన వీడియోను మహ్మద్ ఫ్యూచర్వాలా అనే ట్విట్టర్ యూజర్ పోస్టు చేయగా అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు నెటిజన్లకు కోపాన్ని తెప్పించింది.. ఆ వీడియోలో కొత్తిమీర, స్పెసెస్, పచ్చిమిర్చి, శనగలు వేసి ఆఖర్లో బాగా పండిన అరటి పండ్లను వేసి చేతితో బాగా మిక్స్ చేయడం చూడవచ్చు. ఆలూ స్థానంలో బనానా వేసినట్లు తెలుస్తోంది. ఆ మిశ్రమంతోనే పానీ పూరీలు వడ్డిస్తూ కనిపించింది ఆ వీడియోలో. ఈయన వద్దకు వచ్చిన ఓ అమ్మాయికి ఈ బనానా పానీ పూరీ ఇవ్వడం ఆమె లొట్టలు వేసుకుంటూ తింటుంది..
ఈ వీడియోపై స్పందిస్తూ నెటిజన్లు రెండుగా విడిపోయారు. కొందరు ‘వావ్.. వాటే కాంబో.. టేస్టీ’ అంటూ కామెంట్ చేయగా.. మరొకరు మాత్రం ‘ఇదేం ఫుడ్ కాంబినేషన్ అంటూ’ పెదవి విరిస్తున్నారు. ‘ఈ దారుణమైన ఘటన ఎక్కడ జరుగుతోంది’ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు… అది తిన్న వాళ్ల పరిస్థితి బాగానే ఉందా అంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. చాలా మందికి ఫేవరెట్ ఫుడ్ అయిన పానీ పూరీని అలా బనానాతో చేస్తూ చెడగొడుతున్నారు’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు.. మొత్తానికి ఈ వీడియో అయితే నెట్టింట హల్ చల్ చేస్తుంది.. ఇక మాటలెందుకు ఒకసారి చూసి తరించండి..
Hurting the food sentiments of Pani Puri lover’s on the TL
Presenting Banana Chana Pani Puri🙈 pic.twitter.com/961X9wnuLz
— Mohammed Futurewala (@MFuturewala) June 22, 2023