Site icon NTV Telugu

Balakrishna Accident: హిందూపురంలో బాలయ్యకి తప్పిన ప్రమాదం

Balu1

Balu1

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ప్రమాదం తప్పింది. ప్రచార వాహనంపై నుంచి పడబోయారు బాలకృష్ణ.. కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వాహనం కదలడంతో తుళ్లి వెనక్కి పడిపోయారు బాలకృష్ణ..దీంతో కాసేపు ఏం జరుగుతుందో తెలీక అయోమయానికి గురయ్యారు అభిమానులు. బాలయ్య పర్యటన సందర్భంగా భారీగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.

ప్రభుత్వం , సీఎం పై ఘాటు విమర్శలు చేశారు బాలయ్య. గతంలో తెలంగాణ లో కాళ్ళు మొక్కుతా బాంచన్ అన్న విధంగా రాష్ట్రం లో పాలన ఉంది. ఓట్లేసి గెలిపించుకుంటే బాదుడే బాదుడే తెచ్చాడు. మూడు రాజధానిలని మూడేళ్లు గడిపాడు. నవరత్నాల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని అధ్వాన్నంగా పరిస్థితులు ఉన్నాయి. ఉచిత పథకాలు మోజులో పడి మోసపోకండి… ధరల బాదుడు పెరుగుతోంది.

లాండ్, శాండు, మెయిన్, వైన్ అన్నింటినీ వైసీపీ దోచుకుంది. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం, ఇన్ సైడ్ ట్రేడింగ్ పేరుతో అమరావతిని ఆపేశారు.జగన్ అసలు అతను మనిషే కాదు. చీము నెత్తురు, సిగ్గు శరం ఏమీ లేవు. కియా చంద్రబాబు తీస్తే…. అనుబంధ సంస్థలు జగన్ దెబ్బకి వద్దురా బాబు అని పారిపోయారు.ఉద్యోగ నోటిఫికేషన్ లు రావు… యువత గంజాయికి అలవాటు పడుతున్నారు.గంజాయిలో దేశం లో ఏపి నెంబర్ వన్ గా ఉంది.పన్నుల పై పన్నులు వేస్తూ.. చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇది.జగన్ బెదిరింపులకు భయపడేవారు ఎవరు లేరు. ఓరుగల్లు పోరుబిడ్డల్లా… పల్నాడు సింహాల్లా.. సీమ బిడ్డలా పోరాడాలి.జగన్ ఒక్క అవకాశం ఇస్తే ఏం పీకుతున్నాయి. దావోస్ లో రాష్ట్రం తరఫున ఒక్కరూ వెళ్ళలేదు. సీఎం, ఆర్థిక శాఖ మంత్రి వెళ్లాల్సి ఉన్న ఎవరు లేరు

 

Exit mobile version